తారకరత్న పరిస్థితి విషమం.. ఎక్మో అమర్చిన వైద్యులు

Update: 2023-01-28 10:47 GMT
కుప్పంలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి హీరో తారకరత్న పరిస్థితి విషమించినట్టు తెలిసింది.   లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయాడు.టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు.

తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అని గుర్తించి వైద్యులు మొదట సీపీఆర్ చేశారు. కార్డియాలజిస్ట్ గుండెపోటు అని తేల్చడంతో కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు.

నందమూరి తారకరత్న ఆరోగ్యాన్ని బాలకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు. ఇక కుప్పంలో చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం కలుగకపోవడంతో క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలించారు. బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ సూచించారు. డాక్లర్ల సూచనతోనే బెంగళూర్‌కు తరలిస్తున్నామని.. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయ్యిందని బాలకృష్ణ మీడియాకు నిన్న వివరించారు.

నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు.

తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉండడంతో గుండె దాదాపు పనిచేయడం లేదని తెలుస్తోంది. ఎక్మో అమర్చడం వల్ల ఆర్టిఫిషియల్ గా శరీరభాగాలకు రక్తం , ఆక్సిజన్ అందుతోంది.

కాగా గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో ఎక్మో చికిత్స అందిస్తారని వైద్యులు చెబుతున్నారు.     



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News