ఈమధ్య కాలంలో మనిషికున్న ఆంబిషన్స్ లో చనిపోయే వరకూ అందంగా ఉండటం.. మరణించే వరకూ యవ్వనంగా కనిపించడం.. ప్రధానంగా వచ్చి చేరుతున్నట్లున్నాయి. దీంతో దీనికోసం ఎవరికి తోచిన పద్దతులు వారు అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో తనకు తాను అనుకున్నాడో.. లేక, నిజంగానే అలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ... అందంగా ఉండటం కోసం మందులోకి మిక్సింగా బ్లడ్ వాడేస్తున్నాడు ఒక పెద్దమనిషి!
సాధారణంగా అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని కోరుకునేవారిలో కొంతమంది వ్యాయామాలను, సరైన ఆరోగ్య అలవాట్లను నమ్ముకుంటే.. మరికొందరు కాస్మోటిక్స్ ని నమ్ముకుంటారు. అయితే.. థాయ్ లాండ్ కు చెందిన ఒక వ్యక్తి మారం రక్తపిపాసిగా మారాడు. అందంగా కనిపించడం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం అంటూ ప్రతిరోజూ మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు.
వివరాళ్లోకి వెళ్తే... థాయ్ లాండ్ కు చెందిన రోజాకోర్న్ నైనోన్ కు సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫాం ఉంది. వాటి చర్మం, రక్తం, మాంసాలతో ఇతను వ్యాపారం చేస్తుంటాడు. ఇలా ఉండగా... ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట. ఇక చూస్కో అక్కడినుంచి మొదలు... డైలీ ఒక మొసలి రక్తం తాగేస్తున్నాడంట.
అవును... రోజూ ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఇతడు... "మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో లావోఖానో అనే థాయ్ మద్యాన్ని కలిపి కాక్ టెయిల్ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను" అని చెబుతున్నాడు.
అదేవిదంగా... కేవలం మూడు, నాలుగు ఏళ్ల వయసున్న మొసళ్ల రక్తం మాత్రమే అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుందని కూడా చెబుతున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో... తాజాగా ఈ కాక్ టెయిల్ ను ఒక పెగ్ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడట!