కరోనా విజృంభణ ..3 కుక్కలు - 50 కాకులు మృతి !

Update: 2020-04-24 06:10 GMT

దేశంలో ఒకవైపు కరోనా కోరలు చాచుతున్న సమయంలో ఊహించని విధంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలని మరింత ఆందోళనకి గురిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడు లోని నాగపట్టణం జిల్లా పూంపుహార్ ‌లో దారుణ ఘటన  చోటుచేసుకుంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. మొత్తం 50 కాకులు - మరో మూడు కుక్కలు.. ఒకేసారి మృతి చెందాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కాకులు - కుక్కలు మృతి చెందడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. 

దీనితో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పశుసంవర్ధక అధికారులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకొని కుక్కలు, కాకుల కళేబరాల నుంచి నమూనాలను సేకరింఛి పరీక్షలు చేస్తున్నారు. అలాగే దీనిపై పోలీసులు కూడా ఎవరైనా విషాహారం పెట్టారా? లేక.. వేరే కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా , దేశంలో లాక్ డౌన్ అమలు అవుతున్న సమయంలో వరుసగా మూగజీవుల మరణాలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మద్యే కర్నూలు జిల్లాలో పెద్ద సంఖ్యలో కాకులు - కోతుల మరణాలు సంభవించగా.. విజయవాడలో ఆవుల కళ్లలో నుంచి రక్తం రావడం - శరీరం పై పొంగులు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 



Tags:    

Similar News