సూపర్ స్టార్లు.. మెగాస్టార్లు.. ఇలా ఆ స్టార్ ఈ స్టార్ అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లు.. వారికి మించి ప్రజల కోసం.. ప్రజల బతుకుల్ని బాగు చేయటం కోసమే తాము బతుకుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చే రాజకీయ నేతలు.. ఈ నేల మీద.. కంపెనీలు పెట్టి వేలాది కోట్లు సంపాదించినోళ్లు.. బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టినోళ్లు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరూ చేయలేనంత భారీ విరాళాన్ని ఒకే ఒక్కడు.. అది కూడా 27 ఏళ్ల పోరుడు ఇచ్చిన మొత్తం తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. ఇంతకీ.. ఆ కుబేరుడు ఎవరు? ఎంత మొత్తం దాని చేశాడు? అంత భారీ మొత్తం అతనికి ఎక్కడిది? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే బోలెడన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఇంతకూ భారత్ లోని కోవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. దాని నుంచి బయటపడేందుకు వీలుగా క్రిప్టో బిలియనీర్.. ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ భారతదేశానికి రూ.7400 కోట్ల భారీ భూరి మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు. తాజాగా తన సొంత క్రిప్టో కరెన్సీ అయినా 50 ట్రిలియన్ డాలర్లకు పైన షిబా ఇను కరెన్సీని దానం చేయటం సంచలనంగా మారింది.
బిట్ కాయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదే తరహాలో బిట్ కాయిన్ తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ పేరు ‘‘ఏథీరియం’’. దీని ధర మే10న ఒక్కొక్కటి 3000 డాలర్లు. దీంతో.. ఈ కరెన్సీ సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ ప్రపంచంలో అత్యంత చిన్న వయసులో క్రిప్టో బిలీయనీర్ గా మారిపోయాడు. భారత్ లోని కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అయితే.. భారత్ లో క్రిప్టో కరెన్సీ రద్దు కాలేదని పేర్కొన్నారు.
ఇంత భారీగా విరాళాన్ని ప్రకటించిన వెంటనే.. గడిచిన 24 గంటల్లో షిబాఇను ధర 35 శాతం క్షీణించగా.. తాజాగా నష్టాల నుంచి రికవరీ కావటం గమనార్హం. బుటెరిన్ విరాళంపై భారత టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్ లో ఈ క్రిప్టో కింగ్ ప్రకటించిన తాజాగా విరాళం సంచలనంగా మారింది. దేశంలోని పరిస్థితుల్ని అర్థం చేసుకొని స్పందించినందుకు బుటెరిన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అంత చిన్న వయసులో ఇంత భారీ మొత్తాన్ని సాయంగా అందించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ.. ఈ క్రిప్టో కరెన్సీ ప్రభుత్వ ఖాతాలోకి విరాళం రూపంలో ఎలా జమ అవుతుందన్నది ఇప్పుడు అసలుసిసలు ప్రశ్న.