సామాన్యులు మొదలు పెద్ద పెద్ద వారిని సైతం నోట్ల రద్దు నిర్ణయం తిప్పలు పెడుతోంది. కరెన్సీ కటకటతో పాటు.. నగదు విత్ డ్రా మీదున్న ఆంక్షల ఫలితంగా పెళ్లిళ్లు.. ఇతర వేడుకలు జరుపుకునే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక.. ఆసుపత్రుల్లో పాత నోట్లు తీసుకోవాలని రూల్స్ చెబుతున్నా..వాటిని అమలు చేస్తున్న వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. నోట్ల రద్దు నిర్ణయ ప్రభావం పెద్ద పెద్ద రాజకీయ నేతల మీద కూడా ఉంటుందనటానికి తాజాగా ఒక ఉదంతం నిదర్శనంగా మారింది.
ఏపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కుటుంబానికి సంబంధించిన ఒక వేడుకపై రద్దు ప్రభావం పడింది. ఆమె మరిది కుమార్తె పెళ్లికి ముందు జరిపే ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని డిసెంబరులో నిర్వహించాల్సి ఉంది. అయితే.. నోట్ల రద్దుపై నెలకొన్న ఆంక్షల ఫలితంగా గ్రాండ్ గా చేయాలని భావించిన పెళ్లిని నామమాత్రంగా జరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
రద్దుకు ముందు ఎంగేజ్ మెంట్ ముహుర్తాన్ని డిసైడ్ చేసుకున్న సందర్భంలో ఈ వేడకను భారీగా నిర్వహించాలని భావించారు. ఇందుకోసం గుంటూరులోని పెద్ద ఫంక్షన్ హాల్ ను బుక్ చేశారు. అయితే.. ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం కారణంగా.. బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసేందుకు పరిమితులు అడ్డురావటంతో.. వేడుకను ముందు అనుకున్నట్లుగా గ్రాండ్ చేసే వీలు లేకపోయిందట.
దీంతో.. ముందుగా బుక్ చేసిన ఫంక్షన్ హాల్ ను క్యాన్సిల్ చేసి తెనాలిలోని ఐతానగర్ లోని సాయిబాబా ఆలయానికి వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. బంధుమిత్రుల్ని భారీగా పిలిపించి కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా.. అది సాధ్యం కాదని తేలటంతో కేవలం కుటుంబ సభ్యుల మధ్యలో ఎంగేజ్ మెంట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. నిజంగానే అలాంటి అవకాశం ఉందా? అన్నది ప్రశ్నగా మారుతోంది. ఎందుకంటే.. బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకోవటానికి మాత్రమే పరిమితి తప్పించి.. ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేయటం కానీ.. చెక్కులు.. కార్డులతో చెల్లించే అవకాశం ఉంది కదా? అయినప్పటికీ గ్రాండ్ గా కాదనుకొని.. సింఫుల్ గా చేసుకోవటం ఏమిటి చెప్మా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/