హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు..!

Update: 2021-02-19 07:30 GMT
ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వారికి ఓ షాకింగ్ న్యూస్. మేము ట్రాఫిక్ రూల్స్ పాటించము , కావాలంటే ఫైన్ వేయండి చలానా కడతాం అని చెప్పేవారికి ముఖ్యంగా ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూసే .. ఎందుకంటే ఇకపై హెల్మెట్ లేకుండా లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా ఈ  సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే... మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, రోడ్డు భద్రతలో  తమకతో సహకరించాని కోరారు. తద్వారా   ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.  దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక  షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు.
Tags:    

Similar News