భార్య, భర్త నుంచి విడిపోయినవారు, లేదా భార్యభర్తల్లో ఎవరైనా దూరమైనవారు, యువకులు, ఉద్యోగులు తదితరులకు పలు డేటింగ్ సైట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. దీంతో పలువురు తమకు సరైన భాగస్వామి కోసం డేటింగ్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు.
పాపం ఇదే రీతిలో ఒక 78 ఏళ్ల వ్యక్తి డేటింగ్ సైట్ ను ఆశ్రయించి నిండా రూ.1.02 కోట్లకు మోసపోయాడు. ఆయనకు పలువురు యువతులతో డేటింగ్ చేయిస్తామని చెప్పి డేటింగ్ సైట్ ఉద్యోగులే పలు విడతల్లో రూ.1.02 కోట్లు దోచుకున్నారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 78 ఏళ్ల వ్యక్తి ఒక ప్రవేట్ కంపెనీలో సీనియర్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఆయన భార్య గతంలోనే మరణించింది. ఈ క్రమంలో తనకు తోడు ఎవరూ లేకపోవడంతో ఒక డేటింగ్ సైట్ ను ఆశ్రయించాడు. అతడి అమాయకత్వాన్ని, తెలివితక్కువతనాన్ని ఆసరాగా చేసుకున్న ఆ డేటింగ్ సైట్ ఉద్యోగులు అతడిని మోసం చేశారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు ఫుణెలో సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
మోసగాళ్లు తమను తాము రజత్ సిన్హా, నేహా శర్మగా బాధితుడితో పరిచయం చేసుకున్నారు. మే 2022లో బాధితుడిని మొదటిసారి ఫోన్‌లో సంప్రదించారు. వారిద్దరూ వాట్సాప్‌లో సంభాషణను కొనసాగించారు. తమ డేటింగ్ సైట్‌ల ద్వారా మహిళలకు పరిచయం చేస్తామని నమ్మబలికారు. అయితే.. ఇందుకు డబ్బు ఖర్చవుతుందని.. తమ సేవలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో విడతలవారీగా రజత్ సిన్హా, నేహా శర్మలకు డబ్బు చెల్లిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో నేహా శర్మ, రజత్ సిన్హా ఇద్దరూ బాధితుడికి కొంత నగదును ’రిఫండబుల్ ఛార్జీలు’ కింద చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బాధితుడు మే 2022 తర్వాత రజత్ సిన్హా, నేహా శర్మ ఇచ్చిన ఖాతాలకు పలుమార్లు డబ్బును బదిలీ చేశాడు. ఇలా అతడి నుంచి రూ.1.02 కోట్లు దోచుకున్నారు.
అయితే బాధితుడికి ఎలాంటి డేటింగ్ సేవలు అందించలేదు. పొందలేదు. అతనికి ఎలాంటి నగదు వాపసు కూడా రాలేదు. దీంతో బాధితుడు రజత్ సిన్హా, నేహా శర్మ తదితరుల బ్యాంకు ఖాతాల వివరాలతో వారిపై పూణె పోలీసులు ఫిర్యాదు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.