డిసెంబరు అన్నంతనే శీతలగాలులు గుర్తు వస్తాయి. ఉదయం ఎండతో పొడి వాతావరణం సాయంత్రం అయ్యే సరికి చలి మొదలై.. రాత్రికి మరింత ముదిరి.. తెల్లవారుజామున వణికించేలా ఉండే చలి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దక్షిణాదిలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే.
అందుకు భిన్నంగా గడిచిన మూడు రోజుల్లో పరిస్థితులు మారాయి. ఆకాశం ముబ్బు పట్టేయటం.. వర్ష సూచనలతో పాటు.. ఉదయం వేళలోనూ సాయంత్ర వాతావరణం నెలకొని ఉండటం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాను కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది.
తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవటం తెలిసిందే. గురువారం రాత్రికి చెన్నైకు 440 కి.మీ. ఆగ్నేయంగా ఉంది. ఇది ఈ రోజు (శుక్రవారానికి)కు మరింత బలహీనపడి తుపానుగా మారుతుందని చెబుతున్నారు.
ఈ రోజు అర్థరాత్రి నాటికి పుదుచ్చేరి.. శ్రీహరికోట మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో పుదుచ్చేరి.. ఏపీ.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్ష ప్రబావం ఉండనుంది.
ఇప్పటికే దక్షిణ కోస్తా.. రాయలసీమలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు దక్షిణ కోస్తా.. రాయలసీమలలో విస్తారంగా.. ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
మాండస్ తుపాను తీవ్రత నేపథ్యంలో ఏపీ అధికార యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తంగా ఉంచారు. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకున్నారు. తుపాను కారణంగా అనుకోని సమస్యలు ఎదురైన పక్షంలో సత్వర చర్యలకు వీలుగా సిద్ధమవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.