తమిళనాడు.. పుదుచ్చేరిని వణికిస్తున్న నివర్.. తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం
భయపెడుతున్న నివర్ తుఫాను.. అతి తీవ్ర తుపానుగా మారింది. తమిళనాడు.. పుదుచ్చేరి రాష్ట్రాల్ని వణికిస్తున్న ఈ తీవ్ర తుపాను ప్రభావం రెండు తెలుగురాష్ట్రాలతో సహా కర్ణాటక మీద కూడా ఉండనుంది. బుధవారం సాయంత్రం.. కరైకల్.. మహాబలిపురం మధ్య తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో గాలులు గంటకు 120 నుంచి 145 కి.మీ. మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను దాటే సమయంలోనే కాదు.. ఈ నెల 26.. 27 తేదీల్లో తమిళనాడులోని కడలూర్.. విళ్లుపురం.. కళ్లకురిచ్చి జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు ఖాయమని చెబుతున్నారు.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాంధ్ర.. రాయలసీమ జిల్లాలతో పాటు.. ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. గతంలో వచ్చిన ‘‘గజ’’ తుపానుతో పోలిస్తే.. ‘‘నివర్’’ తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తీవ్ర తుపానుగా చెబుతున్న నివర్ కారణంగా జరిగే నష్టానికి అవసరమైన సాయాన్ని.. సహకారాన్ని అందిస్తామని ప్రధాని మోడీభరోసా ఇచ్చారు.
ఈ విపత్తు నేపథ్యంలో తమిళనాడు.. పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. సహాయ.. సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇక.. ఈ తుపాను నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా అత్యవసర విభాగాల ఉద్యోగులకు మినహా మిగిలిన అందరికి సెలవును ప్రకటించారు. పుదుచ్చేరిలోనూ మంగళవారం నుంచి మూడురోజుల పాటు 144సెక్షన్ విధించారు. ముందస్తుజాగ్రత్త చర్యల్లో భాగంగా చెన్నైలో సబర్బన్ సహా దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. ఏడు జిల్లాల్లో ఇప్పటికే ప్రజా రవాణాను ఆపేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా.. తక్కువ ఆస్తి నష్టం ఉండేట్లు చూసుకోవటమే లక్ష్యమని చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ.. నివర్ ఏం చేస్తుందో చూడాలి.