జ‌గ‌న్ కు స‌ల‌హాలు స‌రే - మీ గురించి ఆలోచించుకోండి!

Update: 2020-02-22 12:30 GMT
జ‌గ‌న్ కు ఎవ‌రు స‌ల‌హాలు ఇస్తున్నారో.. అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డి.రాజా. అమ‌రావ‌తి విష‌యంలో మ‌ట్లాడుతూ ఈయ‌న ఇలా స్పందించారు. మొత్తానికి అమ‌రావ‌తి కోసం సీపీఐ జాతీయ నాయ‌క‌త్వం కూడా క‌దిలిన‌ట్టుగా ఉంది. కామెడీ ఏమిటంటే.. అమ‌రావ‌తి కోసం సీపీఐ ఉద్య‌మిస్తుంద‌ట‌ - అది కూడా జాతీయ వ్యాప్తంగా. దేశ వ్యాప్తంగా అమ‌రాతి కోసం సీపీఐ పోరాడుతుంద‌ని ఆ పార్టీ వాళ్లు ప్ర‌క‌టించ‌డం కామెడీగా మారింది.

అమ‌రావ‌తి గురించి ప‌క్క జిల్లాలోనే ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌డం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లు  ఎక్క‌డైనా హ‌ల్ చ‌ల్ చేస్తే దాన్ని ఆందోళ‌న అనాల్సిందే త‌ప్ప‌.. అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధానిగా ఉండాలంటూ.. ఏపీలోనే ప‌క్క జిల్లాల్లో డిమాండ్ లేదు. రాజ‌ధాని ప్రాంతంగా గుర్తించ‌బ‌డిన 29 గ్రామాల్లోనే పూర్తిగా ఆందోళన లేద‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఆ గ్రామాల్లో కూడా కేవలం మూడు గ్రామాల్లో మాత్ర‌మే ఆందోళ‌న‌లు సాగుతున్నాయ‌ని, అందులో ఒక గ్రామంలో మాత్ర‌మే శిబిరం న‌డుస్తూ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి! ఇలాంటి అంశాన్ని ప‌ట్టుకుని దేశ వ్యాప్తంగా - జాతీయ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు అని క‌మ్యూనిస్టులు ప్ర‌క‌టించ‌డం కామెడీగా ఉంది.

ఇక మూడు రాజ‌ధానుల విష‌యంలో జ‌గ‌న్ కు ఎవ‌రు స‌ల‌హాలు ఇస్తున్నారో అంటూ సీపీఐ నేత రాజా వ్యాఖ్యానించ‌డం మ‌రీ విడ్డూరం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌నేది ప్ర‌జ‌ల కోరిక‌. అలాగే ఏపీ విష‌యంలో శ్రీబాగ్ ఒడంబ‌డిక అనేది ఉండ‌నే ఉంది.  ఇలాంటి నేప‌థ్యంలో క‌మ్యూనిస్టులు త‌మ‌కు తోచింది మాట్లాడి మ‌రింత‌గా ప‌రువు తీసుకుంటూ ఉన్నారు.

అయినా జ‌గ‌న్ కు స‌ల‌హాలు త‌ర్వాతి సంగ‌తి - క‌మ్యూనిస్టులు రాజ‌కీయంగా త‌మ పరిస్థితి ఇలా ఎందుకు త‌యారైందో ఆలోచించుకుంటే మంచిద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఒక ద‌శ‌లో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అయినా క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి బాగా ఉండేది.  చేతిలో అధికారం ఉండేది. అయితే క్ర‌మ‌క్ర‌మంగా తాము ఎందుకు బ‌ల‌హీన ప‌డిన‌ట్టో , తాము ఎవ‌రి స‌ల‌హాల‌తో దెబ్బ‌తిన్న‌ట్టో క‌మ్యూనిస్టులు గ్ర‌హిస్తే మంచిద‌ని వారి హిత‌కారులు అంటున్నారు!
Tags:    

Similar News