తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టలోకి వచ్చిన వారిని ‘‘బంగారు తెలంగాణ బ్యాచ్’’.. షార్ట్ కట్ లో బీటీ బ్యాచ్ అంటూ ముద్దుగా పిలుచుకోవటం తెలిసిందే. మొదట్నించి టీఆర్ ఎస్ లో ఉన్న వారికి దక్కని పదవులు.. తెలంగాణ వచ్చాక.. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం ఉన్నత పదవులు దక్కటంపై మొదట్నించి టీఆర్ ఎస్ పార్టీలో ఉన్న నేతలు కినుకు వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన పెద్ద మనిషి డి. శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉనన్నిరోజులు తనకు ఎలాంటి పదవులు దక్కలేదని.. పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చినా తనకు మాత్రం ఎలాంటి లాభం చేకూరలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ ఎస్ లోకి వస్తున్న నేతలకు పెద్దపీట వేయటాన్ని డీఎస్ దగ్గర ప్రస్తావిస్తే.. అందరూ బీటీ బ్యాచేనంటూ చెబుతూ తనకు చక్కటి పదవి లభించటానికి 45 ఏళ్లు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం.
మొత్తానికి అందరిని బీటీ బ్యాచ్ గానే అభివర్ణిస్తున్న డీఎస్.. మరో ఆసక్తికర ప్రకటన చేశారు. తనకున్న అనుభవంతో.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేలా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణ సర్కారులో భాగస్వామ్యమైన ప్రతినేతా పక్కరాష్ట్రాన్ని తిట్టిపోయటమే తప్పించి.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల్ని పరిష్కరించే దిశగా పని చేస్తామన్న మాటను మాటవరసకు కూడా చెప్పని పరిస్థితి. అలాంటి సమయంలో డీఎస్ నోటి నుంచి కీలక వ్యాఖ్య రావటం అభినందించాల్సిన విషయమే. ఇప్పటివకూ మాటలు చెబుతున్న డీఎస్ చేతలు ఎలా ఉంటాయన్నది కాలమే బదులివ్వాలి.