డి.శ్రీనివాస్‌కు పదవి దక్కకుండా చేసింది ఆయనా..!

Update: 2015-06-25 05:37 GMT
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ఇటీవల ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. గత ఆరేళ్ల నుంచి ఆ పదవిలో ఉన్న ఆయన ఆ టర్మ్‌ ముగియడంతో శాసనసభ కోటాలో తిరిగి ఎన్నికవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే చివరకు ఆయనకు ఆ పదవి దక్కలేదు. ఢిల్లీ లెవల్లో లాబీయింగ్‌ చేసినా శీనుకు ఎమ్మెల్సీ భాగ్యం లేకపోయింది.

    ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డి.శ్రీనివాస్‌ తనకు పదవి దక్కకపోవడం గురించి ఇంకా ఆవేదనతోనే ఉన్నాడు. ఈ ఆవేదనను ఆయనను బయటకు వ్యక్తం చేశాడు కూడా. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తనకు పదవి దక్కకపోవడానికి కారణం దిగ్విజయ్‌ సింగే అని అంటున్నాడు ఈ మాజీ పీసీసీ అధ్యక్షుడు.

    ఆయన వల్లనే తనకు పదవి దక్కలేదని.. ఈయన అంటున్నాడు. అధిష్టానం తనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని భావించినా దిగ్విజయ్‌ అడ్డుపడ్డాడు అని ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. తను అందరినీ సమన్వయం చేసుకొంటూ పోతానని.. వివాదరహితుడినని.. అయితే ఇలాంటి ఉత్తమ క్వాలిటీలకు విలువ లేకుండా పోయిందని... తనకు పదవి దక్కలేదని.. దిగ్విజయ్‌ కావాలని తనకు ఇలా చేశాడు అని డి.శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడట.

    మరి తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌కు డి.శ్రీనివాస్‌పై ఎందుకు అంత కసి ఉందో కానీ.. శ్రీనివాస్‌ ఆవేదనభరితుడే అవుతున్నాడు. అయినా దీంతో ప్రయోజనం ఏముంది?

Tags:    

Similar News