వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు అధికార తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరగా మరో సీనియర్ నేత సైతం ఇదే దారిలో చేరారు. సీనియర్ నేత దాడి వీరభ్రదరావు వైసీపలో చేరనున్నారు. ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కుమారుడు దాడి రత్నాకర్ తో సహా వైసీపీలో చేరనున్నారు.
సౌమ్యుడిగా పేరొందిన సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ, పలు కారణాల వల్ల దాడి వీరభద్రరావు బయటకు వచ్చేశారు. దాడి వీరభ్రరావు దాదాపు నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఒక దశలో ఆయన తిరిగి తెలుగుదేశం - వైసీపీలోకి వెళ్లాలనుకున్నా - అనివార్య కారణాల వలన అది సాధ్యం కాలేదు.
మరోవైపు దాడి వీరభద్రరావు రాజకీయాల్లో ఇంకా కొనసాగాలనుకున్నా - లేక ఆయన కుమారుడు రత్నాకర్ ను రాజకీయ ఊతం ఇవ్వాలన్నా - దాడి మళ్లీ ఏ పార్టీలోనైనా చేరాల్సిన అవసరం తప్పనిసరి అయింది. కొద్దికాలం కిందట దాడి జనసేన వైపు చూసినప్పటికీ - ఈ చేరిక ఆగిపోయింది. ఇటీవల అనకాపల్లిలో మద్దతుదారులతో దాడి భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వీరభద్రరావు ఈ సందర్భంగా మద్దతుదారుల అభిప్రాయాలు సేకరించారు. పార్టీలో చేరాలని వైసీపీ నేతలు కోరుతున్నారని, 10 రోజుల్లో క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు. వైసీపీలో చేరేందుకు రెడీ అయిన దాడి వీరభద్రరావు తాజాగా వైసీపీ నేతలకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈనెల 9న ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు.