ఇప్పటికి ఏడాదిన్నర క్రితం ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ ఒకటి కోరారు. అది కనుక ఇచ్చి ఉంటే తాము ఏపీలో వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే దానికి ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అని అది ఎపుడో పవన్ కి ఇచ్చేశామని కూడా అన్నారు.
సరే ఎవరు ఏమి మాట్లాడినా జనసేన మాత్రం బీజేపీతో దూరంగానే ఉంటూ వస్తోంది. సొంతంగానే తన కార్యక్రమాలు చేసుకుంటోంది. రోడ్ మ్యాప్ విషయంలో ఆ తరువాత పవన్ మాట్లాడింది కూడా లేదు. ఇదిలా ఉంటే ఇపుడు సోము మాజీ అయ్యారు. దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించారు.
ఆమె బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలసి వచ్చారు. ఆయనతో అన్నీ కూలంకషంగా చర్చించారు. ఏపీలో రాజకీయాలు పొత్తులు గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావన వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పురంధేశ్వరి త్వరలోనే ఢిల్లీ నుంచి విజయవాడ రానున్నారు.
కొత్త ప్రెసిడెంట్ గా వస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఉత్సాహం చొపిస్తున్నాయి. ఇక ఎన్నికల సందడి మొదలైంది కాబట్టి పురంధేశ్వరికి ఏపీలో కొత్త కమిటీని కూడా తొందరగా వేసుకునే అవకాశాన్ని పార్టీ ఇచ్చింది అని అంటున్నారు. అదే విధంగా ఈ విషయంలో ఆమెకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారని అంటున్నారు.
ఒక విధంగా బీజేపీ ఏపీలో ఏ విధంగా ముందుకు సాగాలి. పొత్తుల ఎత్తులు ఏమిటి అన్న దాని మీద పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారని రోడ్ మ్యాప్ ఇచ్చారని అంటున్నారు. అయితే అది పవన్ అనుకున్నట్లుగా రోడ్ మ్యాప్ అవుతుందా లేక బీజేపీ ఆలోచనలకు తగిన విధంగా రోడ్ మ్యాప్ ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.
పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన కలసికట్టుగా 2024 ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అలా చేయడం వల్ల మాత్రమే వైసీపీని గద్దె దించుతామని ఓట్ల చీలిక లేకుండా చూడగలమని ఆయన తలపోస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ నేతల మాటలను చూస్తే మాత్రం టీడీపీతో పొత్తు లేదు అంటున్నారు.
ఏపీ బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ అయితే తమకు పొత్తు అన్నది పూర్తిగా జనసేనతోనే ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఎలా వ్యవహరిస్తారు అన్నది చూడాలి. ఇక పురంధేశ్వరి నియామకం మీద పవన్ కళ్యాణ్ వెల్ కం చెబుతూ ట్వీట్ చేశారు ఆమె అనుభవశాలిగా కొనియాడారు.
దాంతో సోము వీర్రాజు టైం లో ఏర్పడిన గ్యాప్ ఇపుడు తొలగిపోతుందా అన్న చర్చ కూడా వస్తోంది. జనసేన బీజేపీ కలసి పని చేస్తారా రానున్న రోజులలో ఆ రెండు పార్టీలు కలసి జనంలో కనిపిస్తాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పురంధేశ్వరి ముందు తమతో పొత్తు ఉన్న జనసేనను పిలిచి మాట్లాడాలి. ఆ పార్టీని కలుపుకునిపోవాలి
ఆ మీదట పవన్ కోరుతున్నట్లుగా రోడ్ మ్యాప్ ని కూడా కేంద్ర పెద్దలతో చర్చించి రెడీ చేయించాలి. అంటే మూడు పార్టీల పొత్తు అన్న మాట. అది ఎంతవరకూ సాధ్యమన్నది కేంద్ర పెద్దల ఆలోచనా ధోరణిని బట్టి ఆధారపడినా పురంధేశ్వరి మాత్రం చేయ్గలిగే పని ఒకటి ఉంది. జనసేనను కలుపుకుని ముందుకు సాగడం. ఆ విషయంలో మాత్రం ఆమె ముందుకు అడుగులు వేస్తారని అంటున్నారు.
గతంలో మాదిరిగా కాకుండా జనసేనతో మంచి రిలేషన్స్ కొనసాగించడానికే ఆమె చూస్తారు అని అంటున్నారు. ఇక పురంధేశ్వరి కార్యవర్గం ఎలా ఉంటుంది సోము వీర్రాజు టీం కి ఇక్కడా చోటు ఉంటుందా ఎవరెవరిని తీసుకుంటారు అన్న దానిని బట్టి బీజేపీ పెద్దల ఆలోచనలు రోడ్ మ్యాప్ ఏంటో కచ్చితంగా తెలుస్తాయని అంటున్నారు. ఒక్కటి మాత్రం వాస్తవం అంటున్నారు. ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ముందుకే వెళ్తుందని, అయితే అది వ్యూహాత్మకంగా ఉంటుందని అంటున్నారు.