తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీంకి పొద్దున లేస్తే రెండే పనులు ఒకటి మోడీని తిట్టడం. రెండు వైసీపీతో బీజేపీకి అక్రమ సంబంధం అంటగట్టడం. విచిత్రం ఏంటంటే... ఈ రెండింటి లక్ష్యం ఒక్కటే. రాష్ట్రంలో ప్రగల్బాల పాలన వర్కవుట్ కాక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని ఈ ప్రచారాల ద్వారా అడ్డుకునే ప్రయత్నం. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు కదా. మోడీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతే వ్యతిరేకత ఏపీలో చంద్రబాబుపై ఉంది. ఆ విషయం బాబుకూ తెలుసు కాబట్టే... ఈ సర్వేలు ఈ హడావుడిలు.
ఈ ప్రచారంపై ఇప్పటికే వైసీపీ స్పష్టంగా స్పందించింది. 2014 అయినా, 2019లో అయినా మాకు ఎవరి అండా అవసరం లేదు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తాం, 2019లో జగనే సీఎం అని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా దీనిపై బీజేపీ కూడా స్పందించింది. ఈరోజు పురంధేశ్వరి మాట్లాడుతూ వైసీపీ-బీజేపీల మధ్య ఎటువంటి పొత్తూ లేదు. రహస్యంగా లేదు, బహిరంగంగా లేదు. బీజేపీ దేశంలోనే పెద్ద పార్టీ. ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పెద్ద సంఖ్యలో సీట్లు సాధిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించింది.
చంద్రబాబు, టీడీపీ నేతలు ఒక గుడ్డి లాజిక్ చెబుతున్నారు. మోడీని తిట్టడం లేదు కాబట్టి వైసీపీకి బీజేపీతో పొత్తు ఉన్నట్టు అని చెబుతున్నారు. వైసీపీ రాష్ట్ర పార్టీ. రాష్ట్రంలో అధికార పక్షం టీడీపీ. బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష నేతలు అధికార పక్షాన్ని తిట్టకుండా ప్రతిపక్షాన్ని ఎలా విమర్శిస్తారు. మినిమం సెన్స్ లేకుండా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. టీడీపీ తన చేతగానితనాన్ని అందరి మీద నెట్టి కాలం గడపాలని చూస్తుంది. ఇలాంటి చర్యలతో ఆ పార్టీ మరింత పతనం కావడం ఖాయమని ఆమె పేర్కొంది.
చిత్రం ఏంటంటే... ఈ మధ్య టీడీపీ నేతలు సింహం సింగిల్‌గా వస్తుంది.... వచ్చే ఎలక్షన్లలో టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు... అని వ్యాఖ్యానించారు. అది బాగా బ్యాక్‌ఫైర్ అయ్యింది. టీడీపీ 2019లో సింహం అయితే... మరి 2014లో మిమ్మల్ని దేంతో పోల్చాలి అంటూ నెటిజన్లు సెటైర్లు వేయడంతో ఇక ఆ ప్రచారాన్ని టీడీపీ సోషల్ మీడియా ఆపేసింది. సింహం సింగిల్ వచ్చిందని చెప్పుకునే హక్కు ఒక్క వైసీపీకే ఉందంటూ నెటిజన్లు టీడీపీ నేతలకు ఘాటుగానే రిటార్టు ఇచ్చారు.