దళితబంధు అమలును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే హుజూరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షలు నేరుగా ప్రభుత్వం ఇచ్చింది. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు చూపుతోంది. హుజూరాబాద్ లో ఓటమి తర్వాత ఈ పథకం కూడా అటకెక్కిందన్న విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు దళితబంధు ఆగిపోలేదని సీఎం కేసీఆర్ నిరూపించారు. గతంలో ఎంపిక చేసిన 4 జిల్లాల్లోని మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు నిధులు విడుదల చేసింది.
దళితబంధు అనేది ఒక ఉద్యమం అని.. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలువనుందన్నారు. దేశంలోని దళితులందరికీ ఆర్థిక, సామాజిక విపక్షాల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని సీఎం ఆకాంక్షించారు.
దళితబంధు జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఖమ్మం జిల్లా చింతకానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి రూ.50 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లా చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కు రూ.50 కోట్లు విడుదల చేసింది.