కేసీఆర్‌ కు దానం అడ్వాన్స్ షాక్‌

Update: 2015-12-06 11:33 GMT
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షు డు దానం నాగేందర్ టీఆర్ ఎస్‌ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. దానం చేరిక విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానంను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీఆర్ ఎస్ అగ్ర‌నేత డి.శ్రీనివాస్ ఇంట్లో మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి దానం నాగేందర్‌ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దానం పార్టీలో చేరేందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేశారు. ఈ సందర్భంగా దానం సైతం పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.-- ఈ వార్త‌లు నాలుగురోజులుగా నానుతున్నా...ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను వేగ‌వంతం చేసిన టీఆర్ ఎస్‌ లో ఇంకా ఎందుకు దానం చేర‌లేదు?  జంపింగ్ క‌న్ఫ‌ర్మ్ అయిన దశ‌లో దానం...నిదానం ఎందుక‌య్యారు?  పెండింగ్‌ కు కార‌ణం టీఆర్ ఎస్ పార్టీనా లేక దానం సైడు నుంచా అనే ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వ‌స్తున్నాయి.

గత కొంతకాలంగా దానం నాగేందర్ టీఆర్ ఎస్‌ లో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని, ఇందులో వాస్తవం లేదని దానం వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీతో పాటు మరో ఎమ్మెల్యే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇక పార్టీ ముఖ్యనేతలంతా దానంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. మ‌రోవైపు  దానం నాగేందర్‌ ను పార్టీలో చేర్పించేందుకు ముందుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ప్రయత్నించారు. రెండు పర్యయాలు ఫోన్‌ లో మాట్లాడిన తలసానికి దానం అనుకున్న విధంగా స్పందించలేదు. దీంతో మరో మంత్రి పద్మారావుగౌడ్ ఏకంగా దానం ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. పార్టీలో చేరాలని ఇందుకు పార్టీ అగ్రనేతల నుంచి పూర్తిస్థాయిలో సహకరముంటుందని చెప్పారు. చివరగా డీఎస్ ఇంట్లో ఇద్దరు మంత్రులు చేసిన మంత్రాంగం ఫలించడంతో దానం పార్టీలో చేరిక ఖాయమైంది. అనంత‌రం దానం నాగేందర్ తన అనుచరుతో సమావేశమయ్యారు.

కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అనంత‌రం దానం టీఆర్ ఎస్ ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా దానం విప్పిన చిట్టాలో భారీ సంఖ్య‌లో ప‌ద‌వుల లిస్ట్ ఉందంట‌. త‌న‌కు కేబినెట్ ర్యాంక్ ఉన్న రాష్ర్ట‌స్థాయి కార్పొరేష‌న్ ప‌ద‌వి, త‌న అనుచ‌రుల‌కు 3 కార్పొరేష‌న్ ప‌ద‌వులు, మొత్తం 25 కార్పారేట‌ర్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లివ్వ‌డం వంటివి ఇందులో ఉన్నాయ‌ట‌. దీంతో ఖంగుతిన్న టీఆర్ఎస్ నేత‌లు ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాక ప్ర‌స్తుతానికి దానం చేరిక‌ను"ప‌రిశీల‌న‌లో" ఉంచార‌ట‌. మొత్తంగా టీఆర్ ఎస్‌ లోకి రాకముందే...దానం కేసీఆర్‌ కు ఝ‌ల‌క్ ఇచ్చార‌ని ఒక‌టే టాక్ న‌డుస్తోంది.
Tags:    

Similar News