తెలంగాణ కాంగ్రెస్ లో మరో వికెట్ పడేందుకు రంగం సిద్ధమైంది. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని చెబుతున్న దానం నాగేందర్ పార్టీ నుంచి వీడిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే తాజాగా ఆయన తన ముఖ్య అనుచరుల్ని తన ఇంటికి పిలిపించి సమావేశం పెట్టుకోవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బలమైన నేతల్ని తనలో కలిపేసుకోవాలని భావిస్తున్న తెలంగాణ అధికారపక్షం ఇప్పటికే పలువురు నేతల్ని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టున్న దానం నాగేందర్ మీద నజర్ వేసినట్లుగా ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవటంతో ఇతర పార్టీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్న గులాబీ బాస్ నాగేందర్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ కోసం తనకు సన్నిహితులైన నేతల్ని.. కార్యకర్తల్ని తన ఇంటికి ఆహ్వానించిన దానం నాగేందర్.. కాంగ్రెస్ పార్టీని వీడిపోవటం ఖాయమని చెబుతున్నారు. అనుకోని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో ఏమైనా ఆగినా.. ఆయన పోక పక్కా అన్న మాట వినిపిస్తోంది.