బండ్లు ఓడలు కావటం.. ఓడలు బండ్లు కావటం మామూలే. కాల మహిమతో ఇలాంటివి చోటు చేసుకుంటుంటాయి. ఎంత కాలమైనా.. హైదరాబాద్ రాజకీయాలు అన్నంతనే గుర్తుకొచ్చే అతికొద్ది మంది రాజకీయ నేతల్లో ఒకరైన దానంకు పెడుతున్న పరీక్షల్లాంటివి ఎదురుకాకూడదని చెప్పక తప్పదు.
కాంగ్రెస్ పార్టీలో తన పేరుతో కొన్ని టికెట్లు ఇప్పించుకున్న నేతగా గుర్తింపు ఉన్న దానం ఇవాల్టి పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనుకోకుండా ఉండలేం. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోవటమే కాదు.. తనకు దగ్గరి వారి టికెట్ల కోసం సిఫార్సులు చేయటం మామూలే. తాజాగా అలాంటి పరిస్థితి లేదు. అంతేనా.. చివరకు ఆయన సీటే ఆయన కన్ఫర్మ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
తనదైన రాజకీయాలతో తానున్న పార్టీలను.. పార్టీ అధినేతల్ని ప్రభావితం చేసే అలవాటున్న దానంకు తాజాగా ఆయన ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పట్టాన అంతుబట్టటం లేదంటున్నారు. 105 మందితో తొలి జాబితాను కేసీఆర్ విడుదల చేస్తే అందులో దానం కోరుకుంటున్న ఖైరతాబాద్ సీటును ఆయనకు కేటాయిస్తారని భావించారు. అందరు అనుకున్నట్లుగా చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు?
అందుకే.. దానం టికెట్ ను హోల్డ్ లో ఉంచారు ఆయన కోరుకుంటున్నట్లు ఖైరతాబాద్ కు ఇవ్వాలా? గోషామహాల్ కు ఇవ్వాలా? అన్న విషయంలో కేసీఆర్ లెక్కలు కేసీఆర్‌కు ఉన్నాయి. మొదట్లో తనకు ఖైరతాబాద్ టికెట్ తప్పించి.. గోషా మహాల్ కు తాను పోటీ చేయనన్న దానం చేత.. ఏదో ఒక టికెట్ ఇవ్వండి బాబయ్యా.. ఊళ్లో పరువు పోతోందంటూ బతిమిలాడుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయినా.. ఇప్పటికి టికెట్ మీద కన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెబుతారు. ఈ కారణంతోనే కేసీఆర్ ఎక్కడకు వెళితే అక్కడకు ప్రత్యక్షం కావటం.. కేసీఆర్ కుమారుడు తాజా మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లిన చోటుకల్లా వెళ్లి తన హాజరును వారిలో రిజిస్టర్ అయ్యేలా వ్యవహరిస్తున్నారు. మొన్న మెట్రో ఓపెనింగ్ (అమీర్ పేట-ఎల్ బీ నగర్).. నిన్న (గురువారం) టి మండలి సమావేశాలకు వెళ్లి కేటీఆర్.. కేసీఆర్ మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు. మొత్తంగా దానంకు ఉండే ప్రత్యేక స్టాఫ్ట్ వేర్ ను మార్చేసి.. తమ చుట్టూ తిప్పించుకోవటంలో కేసీఆర్.. కేటీఆర్ లు ఫుల్ సక్సెస్ అయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది. దానం అయినా ఇంకెవరైనా సరే.. పవర్ ముందు బలాదూరే బాసూ!