ఎమ్మెల్యే బెదిరింపులు.. వైరల్ వీడియో

Update: 2020-07-26 15:04 GMT
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంకు అధికారులను బెదిరించిన వీడియో ఒకటి మీడియాలో వైరల్ అయ్యింది. ఖైరతాబాద్ కు చెందిన ఓ స్థల వివాదంలో ఎమ్మెల్యే దానం తమను బెదిరించారంటూ బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది.

10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంకు అధికారులు బహిరంగ వేలానికి పెట్టారు.

ఈ సమయంలోనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంకు అధికారుల విధులకు అడ్డు తగిలారు. వేలాన్ని అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేసి బెదిరించారని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దానం బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Full View

Tags:    

Similar News