ఖైరతాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని దానం నాగేందర్ నాల్రోజుల అలక తరువాత ఏం హామీ దొరికిందో ఏమో కానీ టీఆరెస్ ను ఆకాశానికెత్తేశారు. మళ్లీ టీఆరెస్ దే అధికారం - కేసీఆరే సీఎం అంటూ ఆయన తన లాయల్టీ ప్రకటించేశారు. అయితే.. టిక్కెట్ రాకపోగానే కంగుతిన్న దానం కాంగ్రెస్ వైపు అడుగులు వేసినా అక్కడా తాను కోరుకున్న టిక్కెట్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ టీఆరెస్ నే నమ్ముకుంటున్నట్లు టాక్.
తెలంగాణలో మరోసారి అధికార పీఠం టీఆర్ ఎస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత - మాజీ మంత్రి దానం నాగేందర్ నమ్మకం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడనున్న మహాకూటమికి ఘోర పరాభావం తప్పదని - తాజా సర్వేల్లో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. కుటంబ పాలనపై గొంతు చించుకుంటున్న టీపీసీసీ ఆధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దానం సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబానికి ఒక్కరికే సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే సగం మీసం తీసేసి తిరుగుతానని ఉత్తమ్ కు దానం చాలెంజ్ చేశారు.
అయితే.. టీఆరెస్ ఫస్టు లిస్టులో చోటు దొరకని దానంను ఆ వెంటనే ఉత్తమ్ కలిశారన్న ప్రచారం జరిగింది. దాన్ని దానం ఖండించినా ఉత్తమ్ ఖండించలేదు. కానీ... దానం కోరుతున్న ఖైరతాబాద్ టిక్కెట్ పై ఉత్తమ్ కూడా హామీ ఇవ్వకపోవడంతో ఆయన టీఆరెస్ లో కొనసాగేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేసీఆర్ వరకు చేరేలా పెద్దపెద్ద సవాళ్లు విసురుతూ వార్తల్లో నిలుస్తున్నారట.