సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో అమ్మాయిలతో అశ్లీల డ్యాన్సులు!

Update: 2021-02-27 12:30 GMT
ఈ మద్యే ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అయ్యాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచి వారు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఓడిపోయిన వారి భాద వర్ణనాతీతం. ఇదిలా ఉంటే ఓ గ్రామ సర్పంచ్ అంటే .. ఆ గ్రామానికి పెద్ద దిక్కు. గ్రామ బాధ్యతలు అన్ని చూసుకోవాలి అలాగే నలుగురిని సరైన మార్గంలో నడిచేలా చేయాలి. ఊరి కి , ఊరి ప్రజలకి మంచి చేయాలి. కానీ , తాజాగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఓ ప్రజాప్రతినిధి ఈ సంగతే మర్చిపోయాడు. అసాంఘిక కార్యకలాపాలకు తెర తీశాడు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషంలో గ్రామస్థులకు పార్టీ ఇచ్చాడు సర్చంచ్. అయితే, గెలిచిన ఆనందంలో పార్టీ ఇవ్వడంలో తప్పులేదు కానీ , ఆ పార్టీలో అమ్మాయిలతో ఆశ్లీల డ్యాన్స్ చేయించడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే .. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్‌ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. గెలిచిన ఆనందంలో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మహిళలతో రికార్డింగ్‌ డాన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ యవ్వారం చూసిన మిగిలినవారు ఆశ్చర్యపోయారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అమ్మాయిలతో ఆశ్లీలంగా డ్యాన్స్ నిర్వహించడం పలు చర్చకు దారితీసింది. గ్రామ ప్రథమ పౌరుడే ఇలా చేస్తే ఎలా అని చాలా మంది అంటున్నారు. దీనిపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తామని హామీ ఇచ్చాడు. అంతలోనే ఆ మాట ఆవిరైపోయింది. మోడల్ విలేజ్ గా మార్చడం అంటే ఇదేనా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ఘటన పై గ్రామస్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదేం పని, ఇప్పుడే మాట ఇచ్చి, అప్పుడే విస్మరిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరుతున్నారు.
Tags:    

Similar News