ఏపీలో ఓటర్లు ఎటు వైపు అంటే ప్రతీ సంస్థ తానుగా చేసిన సర్వేలలో ఓవరాల్ రిపోర్ట్ నే ఇస్తుంది. అయితే ఇందులో అనేక కేటగిరీలు ఉంటాయి. పట్టణ ఓటర్లు, చదువరులు, ఉద్యోగస్థులు, మహిళలు, ఉన్నత వర్గాలు. న్యూట్రల్ జనాలు ఇలా వివిధ రకాలైన ఓటర్లు ఉంటారు. అయితే ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే ఎవరిది విజయం అంటే వైసీపీ అని జాతీయ సర్వేలు మూడు గట్టిగా చెప్పాయి.
దాంతో వైసీపీలో కొంత నిబ్బరం కనిపిస్తోంది. అదే టైమ్ లో విపక్ష టీడీపీలో కొద్ది మేరకు అలజడి రేగుతోంది. అయితే ఈ సర్వేలు అన్నీ కూడా పెద్దగా పట్టించుకోరాదని టీడీపీ ఎంపుడో ఫిక్స్ అయింది. అక్కడ ఉన్నది చంద్రబాబు. కేవలం వారం రోజుల్లో పోలింగ్ ఉంది అనగా మొత్తానికి మొత్తం సీన్ తిప్పేసే వ్యూహాలు బాబు వద్ద దండీగా ఉంటాయి. దాంతో ఈ సర్వేలను చూసి విపక్షాలు పెద్దగా ఫీల్ అవడంలేదు.
ఇదిలా ఉంటే వైసీపీకి బలం ఉంది. ఎన్నికల్లో గెలుపు అని చెబుతున్న సర్వేలు కూడా వైసీపీకి దెబ్బ పడే ప్రాంతాలను కూడా చెబుతున్నాయి. అలాంటివి చూస్తే అర్బన్ ఏరియాల్లో వైసీపీ బాగా వీక్ అయింది అంటున్నారు. వైసీపీకి పట్టణ ఓటర్లు చెక్ చెబుతున్నారు అని తేలుతోంది. వైసీపీ మీద మోజుతో 2019 ఎన్నికల్లో ఓటేసిన అర్బన్ ఓటరు ఈసారి మాత్రం వీల్లేదని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాడు.
దానికి అనేక కారణాలు ఉన్నాయి. అర్బన్ ఓటర్లు అభివృద్ధిని చూస్తున్నారు. వైసీపీ వచ్చాక అభివృద్ధి అన్నది లేదు అని వారు మండిపడుతున్నారు. కనీసం రోడ్లు వేసే దిక్కు కూడా లేదని అంటున్నారు. ఇక ఏపీ అంతా అప్పుల పాలు కావడం పట్ల ఆర్బన్ ఓటర్లు ఫైర్ అవుతున్నారు. అలాగే మూడు రాజధానుల మీద కూడా వారిలో మంట కనిపిస్తోంది. ఏదో ఒక్క రాజధాని ఏపీకి ఉండాలని, అది అమరావతి అయితే బాగుంటుంది అన్న ఆలోచనలు అర్బన్ ఓటర్లలో ఉన్నాయి.
ఇంకో వైపు చూస్తే మూడేళ్ళుగా ఎలాంటి ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడం కూడా అర్బన్ ఓటర్ల మీద పడుతోంది. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అర్బన్ ఓటర్లకు అందడం లేదు. వారు అర్హులు కారని తేలుతోంది. ఇంకో వైపు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చకా లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బందిగా మారింది అన్న మాట కూడా చదువరులలో ఉందిట. ఇలా అనేక కారణాల వల్ల అర్బన్ ఓటరు రివర్స్ అవుతున్నాడు. దీని మీద ఇపుడు వైసీపీ సొంతంగా చేయించుకున్న నివేదికలు కూడా అసలు నిజాన్ని చెబుతున్నాయట.
దాంతో జగన్ ఈ విషయంలో సీరియస్ గానే దృష్టి పెట్టారని అంటున్నారు. అర్బన్ ఓటర్లు తమ పాలన మీద అసంతృప్తిగా ఉన్నా కూడా వారిని దారికి తేవడం మీద కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారుట. వీలైతే కేవలం అర్బన్ ఓటర్ల కోసం కొన్ని ప్రత్యేక పధకాలను కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారుట. ఇదిలా ఉండగా ఏపీలో మొత్తం 175 సీట్లు ఉంటే ఇందులో అరవైకి పైగా అర్బన్ ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో ఈ సీట్లు తేడా కొడితే మాత్రం వైసీపీకి డేంజర్ బెల్స్ మోగినట్లే అంటున్నారు. దాంతో అర్బన్ లో ఓటర్లను తిప్పుకునే మార్గాలేంటి అన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.