అంబ‌టికి డేంజ‌ర్ బెల్స్‌.. రీజ‌న్ ఏంటంటే

Update: 2021-11-07 02:30 GMT
వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుకు డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇబ్బంది క‌ర ప‌రిస్తితిని ఎదుర్కొన‌డం త‌ప్ప‌దా..? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న అంబ‌టి.. పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. అయితే.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యంలో ఆయ‌న దూకుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి రేసులో ముందున్నట్టు ప్ర‌చారం చేసుకుంటున్న అంబ‌టి.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా.. గుంటూరు లేదా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌నే వాద‌న, విమ‌ర్శ‌లు కూడా కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని.. ముఖ్యంగా ప్ర‌ధాన పార్టీల్లో కీల‌క నేత‌లు బ‌లంగా లేర‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీంతో అంబ‌టి నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నార‌నే టాక్ ఉంది. అయితే.. ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్నాయి. టీడీపీకి బ‌ల‌మైన ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌మ‌కు ఇమ్మంటే త‌మ‌కు ఇమ్మ‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో రెండు వ‌ర్గాలు పోటీ ప‌డ్డాయి. ఇక్క‌డ నుంచి 2014లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న దివంగ‌త స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రాం, న‌ర‌సారావుపేట మాజీ ఎంపీ.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుటుంబాలు.. ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని బావిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంపై కొన్నాళ్లుగా చంద్ర‌బాబు మౌనంగా ఉన్నారు.

ఈ ప‌రిణామ‌మే అంబ‌టిలో ధైర్యాన్ని నూరిపోసింద‌ని అంటారు. ఎలాగంటే.. అటు కోడెల శివ‌రాం ను నిల‌బెడితే.. ఆయ‌న‌పై ఎలాగూ కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి కాబ‌ట్టి.. వాటిని చూపించి.. త‌ను ఏదో ఒక విధంగా గ‌ట్టెక్కేయ‌వ‌చ్చ‌ని బావించి ఉంటారు. ఇక‌, రాయ‌పాటి కుటుంబం నుంచి ఎవరు నిల‌బ‌డ్డా వారు పుంజుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంది. సో.. ఈ రెండు కార‌ణాల నేప‌థ్యంలోనే అంబ‌టి.. ఇక్క‌డ త‌న‌దే విజ‌య‌మ‌నే భావ‌న‌తో ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, ఇప్పుడు ఇక్క‌డ ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల ముందుగానే..కోడెల త‌న‌యుడు డాక్ట‌ర్ శివ‌రాం.. రంగంలోకి దిగారు. పాద‌యాత్ర అంటూ.. తాజాగా ఆయ‌న రోడ్డు మీద‌కు వ‌చ్చారు.

ఆయ‌న‌కు చంద్ర‌బాబు టికెట్‌పై హామీ ఇచ్చారో .. లేదో తెలియ‌దు కానీ.. వ్యూహాత్మ‌కంగా మాత్రం శివ‌రాం అడుగులు వేయ‌డం ప్రారంభించారు. పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణకు చాలా అవశ్యకత ఉందని కోడెల శివరాం అన్నారు. తన తండ్రి కోడెల శివ ప్రసాద్ పట్టుబట్టి రహదారి విస్తరణ పనులు మంజూరు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో చరిత్రలో నిలిచే ఎన్నో అభివృద్ధి పనులు తన తండ్రి చేశారన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివ ప్రసాద్ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని, ప్రభుత్వానికి దమ్ముంటే కోడెలను మించిన అభివృద్ధిని చేసి చూపించాలని శివరాం సవాల్ చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. అంబ‌టికి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News