జూన్‌లో భారీగా కరోనా కేసులు భారీగా పెరిగే ప్రమాదం

Update: 2020-05-26 02:45 GMT
కరోనా మహమ్మారి జూన్ నెలలో మరింతగా విజృంభించే అవకాశముందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనా వంటి దేశాల్లో రెండోసారి తిరగబెడుతోంది. వచ్చే నెల నుండి ముఖ్యంగా భారత్‌లో ఈ వైరస్ తీవ్రరూపం దాల్చవచ్చునని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని, ఇప్పుడు ఇండియాలోను అదే పరిస్థితి తలెత్తవచ్చునని అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన ప్రభావం జూన్ నెలలో కనిపించవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసుల జాబితాలో ఇండియా 144,135 కేసులతో పదో స్థానంలో ఉంది. ఈ రోజు ఒక్కరోజే 5,599 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇండియాలో 4,147 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రతి పది లక్షల మందిలో 2,200 మందికి పరీక్షలు చేశారు. మొత్తం 30,33,591 టెస్టులు నిర్వహించారు. మరణాలు సగటున 3 ఉన్నాయి. అదే అమెరికాలో 301 ఉన్నాయి.

ఇటీవలి కాలంలో భారత్‌లో కేసుల సంఖ్య పెరగడానికి టెస్టుల సంఖ్య పెరగడమే కారణమని చెబుతున్నారు. వీటికి లాక్ డౌన్ సడలింపులు కారణంగా చెప్పలేమని, లాక్ డౌన్ ప్రభావం తెలియడానికి మరికొద్ది రోజులు పడుతుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ దేశంలో లాక్ డౌన్ ఎప్పటికీ కొనసాగించలేమని, ఆంక్షలు సడలించాల్సిందేనని చెబుతున్నారు. కరోనా విషయంలో మనం దారుణస్థితికి చేరుకోలేదని, కానీ ఏప్రిల్, మే నెలల కంటే జూన్‌లో ఎక్కువ కేసులు ఉండవచ్చునని, జూలైలో తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు.
Tags:    

Similar News