దేశంలో వైరస్ కేసులు రోజు రోజుకి భారీ స్థాయి లో పెరిగి పోతున్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ఈ వైరస్ ఎఫెక్ట్ ప్రతి రంగంపై పడింది. వైరస్ భయంతో హైదరాబాద్ లో చిన్న చిన్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ లు పూర్తిస్థాయిలో తెరుచుకో లేదు. ఒక వేళ తెరుచుకున్నా గతంలో వచ్చినట్లు జనాలూ రావడం లేదు. దీనంతటికీ కారణం వైరస్ భయం. దీనికి తోడు వర్షాకాలం రావడంతో సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి. సీజనల్ వ్యాధుల చికిత్సకోసం వెళ్దామనుకునేవారికి ఆస్పత్రులు తెరుచుకోక పోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి తమ సేవలను ప్రారంభించాలని సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని రకాల ఆస్పత్రులు కలిపి 30 వేల వరకు రిజస్టర్ అయినవి ఉన్నాయి. వైరస్ భయంతో వీటిలో చాలా వరకు క్లినిక్ లు ఇంకా తెరుచుకోలేదు. కొంతమంది వైద్యులైతే తమ క్లినిక్‌లను ఇప్పట్లో తెరవబోమని బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. కోటిపై చిలుకు జనాభా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటివరకు చాలా కాలనీ క్లినిక్ లు తెరుచుకోలేదు. అలాగే కొన్ని క్లీనిక్ లో జ్వరం జలుబు వంటి వైరస్ అనుమానిత లక్షణాలున్న రోగులు వస్తే చూడటం లేదు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో జ్వరాలొస్తే చాలా మంది సొంత వైద్యంతో నెట్టుకొస్తున్నారు.
అసలే వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది కొరత ఉంది. కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో జిల్లాల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లను గ్రేటర్ హైదరాబాద్ కు డిప్యూటేషన్ పై రప్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు మొదలైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యమందించేందుకు వైద్యులుండని పరిస్థితులు నెలకొంటాయని వైద్యశాఖ ఆందోళన చెందుతోంది. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ లో రోజూ 300-400 వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత మరింత పెరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.