అక్కడెక్కడో వూహాన్ లో మహమ్మారి విరుచుకుపడిందన్న వార్తల నుంచి.. మన ఊరికి వచ్చేయటం నిన్నటి మాట. మన ఇంటి పక్కకు.. ఆఫీసులో పక్క సీటుకు రావటం నేటి మాట. మాయదారి రోగం విస్తరణ ఎంత ఎక్కువగా ఉందన్న దానికి తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసులే ఉదాహరణ. చిన్నా పెద్దా.. ధనిక..పేద.. సామాన్య.. ప్రముఖులు లాంటి తరతమ తేడాల్లేని మహమ్మారి ఇటీవల కాలంలో ‘వారియర్స్’ మీద పడింది.
గడిచిన కొద్దిరోజులుగా వైద్యులు.. పోలీసులు.. తాజాగా మీడియాకు చెందిన వారు బాధితులుగా మారుతున్నారు. గడిచిన వారంలో తెలుగు మీడియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో పని చేసే తెలుగు మీడియాకు చెందిన వారికి పాజిటివ్ రావటం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో పని చేసే జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్టులకు సోకినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు తెలుగు మీడియాకు చెందిన వారు బాధితులుగా మారుతున్నారు. మొన్నటికి మొన్న సాక్షిలోని ఒక రిపోర్టర్ కు పాజిటివ్ గా తేలితే.. ఆదివారం టీవీ5కు చెందిన జర్నలిస్టు మహమ్మారి కారణంగా అతి చిన్న వయసులోనే మరణించటం షాకింగ్ గా మారింది. ఇది సరిపోదన్నట్లు ఆంధ్రజ్యోతికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్టుకు కూడా పాజిటివ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లోని జర్నలిస్టు వర్గాల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
ఇలా వరుస పెట్టి తెలుగు మీడియాలో చోటు చేసుకుంటున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటివరకూ వారియర్స్ గా పేరున్న వర్గాలకు చెందిన వారు పాజిటివ్ గా మారుతున్న వైనం చూసినప్పుడు.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.