కడప సెంట్రల్ జైల్లో కరోనా బీభత్సం .. ఎంతమందికి సోకిందంటే

Update: 2020-08-11 04:00 GMT
ఏపీలో కరోనా మహమ్మారి జోరు తగ్గడం లేదు. గత రెండు వారాలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య 10 వేలకి పైగా కేసులు నమోదు అవ్వడం తో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు శరవేగంగా పెరుగుతోంది. ఫలితంగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జిల్లాలో సోమవారం  ఒక్క రోజే మరో 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో కరోనా కేసులు 13876 కు దాటాయి. అలాగే ఇప్పటి వరకు కరోనా కారణంగా జిల్లాలో 78 మృతి చెందారు.

నమోదు అయిన కేసుల్లో  7207 మంది డిశ్చార్జ్ అయ్యినట్టు తెలుస్తోంది.  ఇక 6706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అలాగే కడప సెంట్రల్ జైల్లో 19 మంది ఖైదీలకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా సోకిన ఖైదీలని  వెంటనే ఫాతిమా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక జైలును పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.  మిగతా ఖైదీల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.  

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,665 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మరో 80 మంది మరణించారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. కరోనాను జయించి వీరిలో 1,45,636 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 87,773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,116 మంది మరణించారు.
Tags:    

Similar News