పురందేశ్వరి మిస్సయ్యారు... కావాలనేనా..!
ఇదిలావుంటే.. అసలు అన్నగారి కుమార్తె, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ఎక్కడా కనిపించలేదు. దీంతో రాజకీయంగా పురందేశ్వరి వ్యవహారం చర్చకు వస్తోంది.
తెలుగు వారి అన్నగారు.. నవరస నటనా సార్వభౌమ దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను విజ యవాడ శివారులోని కానూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అయిన నిధుల్లో సింహ భాగం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే.. ఎన్టీఆర్ కుటుంబం మొత్తానికీ ఆహ్వానాలు పంపించినా.. ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అన్నగారి వారసుడు బాలయ్య డుమ్మా కొట్టారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఇక, నంద మూరి రామకృష్ణ మాత్రమే స్టేజ్‌పై కనిపించారు. ఒకరిద్దరు మనవరాళ్లు మాత్రమే వచ్చారు. ఇక, సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లోనూ రాఘవేంద్రరావు(ఎన్టీఆర్ తో ఎక్కువ అనుబంధం ఉన్న దర్శకుడు), నిర్మాత అశ్వినీదత్ వంటి వారు కూడా రాలేదు. కారణాలు ఏమైనా.. కూడా.. వారు రాకపోవడం మాత్రం చర్చకు దారి తీసింది.
ఇదిలావుంటే.. అసలు అన్నగారి కుమార్తె, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ఎక్కడా కనిపించలేదు. దీంతో రాజకీయంగా పురందేశ్వరి వ్యవహారం చర్చకు వస్తోంది. ఆమెరాకపోవడానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయని.. అంటీముట్టనట్టుగానే ఉండాలని నిర్ణయించుకున్నారని ఓ వర్గం చెబుతుండగా.. అలాంటి దేమీ లేదని మరికొందరు చెబుతున్నారు. దీనిపై పురందేశ్వరి ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే.. ఆమె రాకపోవడానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.
రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన నేపథ్యంలో పార్లమెంటులో చర్చ సాగింది. ఈ క్రమంలో శనివారం.. సా యంత్రం ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తప్పని సరిగా హాజరు కావాలం టూ.. బీజేపీ ఎంపీలకు పార్టీ విప్ జారీ చేసింది. దీంతో నే ఆమె ఢిల్లీలో ఉండిపోయారన్నది రాజకీయ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇందులో కూడా.. మరో షేడ్ ఉంది. రావాలని అనుకుంటే.. ఆమె ఈ విషయాన్ని బీజేపీకి చెప్పి.. వచ్చేవారని అంటున్నారు. ఏదేమైనా పురందేశ్వరి మిస్సయ్యారన్న కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.