ట్రంప్ ప్రమాణానికి క్లోజ్ ఫ్రెండ్ మోదీని పిలవలేదా? ఎందుకో?

ఇక తాజాగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ ప్రియ మిత్రమా అని సంబోధిస్తూ లేఖ రాశారు.

Update: 2025-01-21 10:25 GMT

భారత ప్రధాని మోదీ అంటే పలు సందర్భాల్లో తనకు ప్రత్యేక అభిమానం అని చాటుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతెందుకు? 2020 చివరలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ను రెండోసారి గెలిపించేందుకు మోదీ ప్రయత్నించారు కూడా. ఆ ఎన్నికలకు ముందు ట్రంప్ నకు పరోక్ష మద్దతు అన్నట్లుగా మోదీ అమెరికా పర్యటన చేశారు.

ఇక తాజాగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ ప్రియ మిత్రమా అని సంబోధిస్తూ లేఖ రాశారు. ట్రంప్ నకు అభినందనలు తెలిపారు. అమెరికా-భారత్ లకు ప్రయోజనాలు కలిగించేందుకు, ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ట్రంప్ తో మళ్లీ కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కాగా, ట్రంప్ ప్రమాణానికి మోదీ తరఫున ప్రతినిధిగా విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్లారు. మోదీ రాసిన లేఖను ట్రంప్ నకు అందజేశారు.

ట్రంప్ బాధ్యతల స్వీకారానికి మోదీని పిలిచారా? లేదా? అనేది పెద్ద సందిగ్ధం. అయితే, విదేశాల్లో ప్రభుత్వాధినేతల బాధ్యతల స్వీకార వేడుకకు భారత ప్రతినిధులను పంపండ ఆనవాయితీ. ఇలా జైశంకర్ వెళ్లారు. ఇక హాజరైనవారిలో ప్రపంచంలోని పెద్ద నాయకులు, మిత్రులతో పాటు శత్రువులు, స్నేహితులు, బద్ద విరోధులు కూడా ఉన్నారట. ట్రంప్ కార్యాలయం జాబితా విడుదల చేయకున్నా.. అతిథుల జాబితా గురించి చాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

2020లో కొవిడ్ వ్యాప్తి సమయంలో ట్రంప్ చైనాను తీవ్రంగా నిందించారు. కొవిడ్ ను చైనా వైరస్ గా అభివర్ణించారు. కానీ, ఈసారి ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీంతోనే 'క్లోజ్ ఫ్రెండ్' మోదీని ఎందుకు పిలవలేదు? అనే ప్రశ్నలు వచ్చాయి. ‘శత్రువు’ను పిలిచి, ‘స్నేహితుడి’ని విస్మరించారు? అనే అభిప్రాయం వ్యక్తమైంది.ఇది 'ప్రత్యర్థులతో వ్యక్తిగత దౌత్యం’ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

''భాగస్వామ్యపరంగా అమెరికాకు జిన్‌పింగ్ చాలా కీలకమైన నేత'' అన్నారు. కాగా, ట్రంప్ ఈ టర్మ్ లో చైనాతో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. చైనాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా వదులుకోవడం అమెరికాకు తీవ్ర నష్టంగా భావిస్తుండడమే దీనికి కారణం.ట్రంప్ 2.0లో అంతర్జాతీయ సమస్యలపైనే ఫోకస్ ఉంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు మూడేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపును ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

మున్ముందు చైనాతో సంబంధాలే ట్రంప్‌ నకు అతిపెద్ద సవాల్‌. అందుకే జిన్‌ పింగ్‌ ను ఆహ్వానించారనే అభిప్రాయం వ్యక్తం అవతోంది. చర్చలకు చాన్స్ ఉందనే సంకేతాలు పంపేందుకే ఇలా చేశారని అంటున్నారు.

Tags:    

Similar News