ఈ అమ్మాయితో ఫోటో దిగాలంటే రూ.100 చెల్లించాలి... వీడియో వైరల్!

అవును... భారతీయ పురుషుల నుంచి రెగ్యులర్ గా వచ్చే సెల్ఫీ రిక్వస్టులతో విసిగిపోయిన.. ఓ రష్యన్ టూరిస్ట్ కం ఇన్ ఫ్లుయెన్సర్ ఓ ఆసక్తికర ఆలోచన చేశారు.

Update: 2025-01-21 10:04 GMT

మొబైల్ ఫోన్ లలో ఫ్రంట్ కెమెరా ఆప్షన్ వచ్చినప్పటి నుంచీ "సెల్ఫీ" అనేది వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కొందరికి నిత్య కృత్యం. గతంలో సెలబ్రెటీలు ఎవరైనా కనిపిస్తే, నచ్చిన వ్యక్తులు తారసపడితే వారి నుంచి ఓ ఆటోగ్రాఫ్ తీసుకోవడం చేసేవారు. ఇప్పుడు దాని స్థానంలో కొన్నిసార్లు అవతలి వ్యక్తి అనుమతితో, మరికొన్ని సార్లు అనుమతి తీసుకోకుండా కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. అభిమానులు సెల్ఫీలు అడిగినప్పుడు సెలబ్రెటీలు ఒక నిమిషం ఆగి ఇస్తే తప్పేంటి అని ఒకరంటే.. వారు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నప్పుడు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వెంటపడటం సెలబ్రెటీలకు చాలా ఇబ్బంది అని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాలని అనేవాళ్లూ ఉన్నారు. ఈ సమయంలో తనకు ఎదురైన ఈ సమస్యకు ఆసక్తికర పరిష్కారం కనుగొంది ఓ రష్యన్ అమ్మాయి.

అవును... భారతీయ పురుషుల నుంచి రెగ్యులర్ గా వచ్చే సెల్ఫీ రిక్వస్టులతో విసిగిపోయిన.. ఓ రష్యన్ టూరిస్ట్ కం ఇన్ ఫ్లుయెన్సర్ ఓ ఆసక్తికర ఆలోచన చేశారు. ఇందులో భాగంగా.. తనతో సెల్ఫీ అడిగే వారికి ఒక్కో ఫోటోకూ రూ.100 చొప్పున వసూలు చేయనున్నట్లు ఫ్లకార్డు చేతపట్టి బీచ్ లో కనిపించింది. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీనికి ఆమె ఇచ్చిన క్లారిటీ కూడా బాగుందని అంటున్నారు.

ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఏంజిలినలి777 షేర్ చేసిన వీడియోలో ఆమె వద్దకు వచ్చే స్థానికులు... "మేడం.. ఒక్క ఫోటో ప్లీజ్?" అని అడిగే విధానాన్ని హాస్యాస్పదంగా అనుకరించరు. ఈ సమస్యకు పరిష్కారంగా "1 సెల్ఫీ - రూ.100" అని చేతితో వ్రాసిన ఫ్లకార్డును చూపిస్తుంది. ఈ సందర్భంగా స్పందిస్తూ.. భారతీయులు వారు కోరిన ఫోటోను వారు పొందుతారు.. నేను నా సమయానికి పరిహారం పొందుతాను అని రాసుకొచ్చింది.

Tags:    

Similar News