ఏపీకి పాకిన స్ట్రెయిన్?.. అధికారుల ఉరుకులు పరుగులు.. రాజమండ్రిలో టెన్షన్!
బ్రిటన్ను వణికించిన కొత్త కరోనా స్ట్రెయిన్ ఇప్పుడు ఏపీలోకి వచ్చేసిందా. ఇటీవల చాలా మంది యూకే నుంచి ఇండియాకు వచ్చారు. వారిలో చాలామందిలో కరోనా లక్షణాలు ఉన్నాయి. అయితే వారికి సోకింది. జన్యుమార్పిడి చెందిన వైరస్సా లేక పాత కరోనాయేనా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంపై వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చి కరోనా లక్షణాలు కనిపించిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చినవారిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ క్రమంలో వైద్యులు కరోనా పరీక్షలు ముమ్మురం చేశారు.
మరోవైపు ఢిల్లీలో ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కొత్త కరోనా కేసు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఒకరు ఇటీవల బ్రిటన్ వెళ్లారు. అయితే ఆమె ఈ నెల 22న బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆమెను తీసుకొచ్చేందుకు కుమారుడు ఢిల్లీ వెళ్లారు. అయితే సదరు మహిళకు బ్రిటన్‌లో కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ఆమె పరీక్షలు చేయించుకొని ఫలితాలు రాకముందే ఇండియాకు వచ్చేసింది.
అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెకు పరీక్షలు చేసి క్వారంటైన్లో ఉంచారు. అయితే ఆమె క్వారంటైన్ సెంటర్లోనుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఢిల్లీలోని నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం పోలీసులు ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు వచ్చినవెంబడే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌కు పంపించనున్నారు. అయితే ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఐసోలేషన్‌కు పంపించినట్టు సమాచారం. అయితే సదరు మహిళ, ఆమె కుమారుడు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడంతో ఆమె ఎక్కడుంది అన్న విషయం తెలియక పోలీసులు టెన్షన్ పడ్డారు. ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు.