ప్రభుత్వం చెప్పిన ఫీజులతో కరోనాకు చికిత్స ఇవ్వలేం..!!

Update: 2020-08-21 03:45 GMT
తెలంగాణలో కరోనా  వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతో ట్రీట్మెంట్ ఇవ్వడం అసాధ్యమని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల అసోసియేషన్లు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణలో కరోనాతో ఆసుపత్రికి వెళ్తే రూ.లక్షల్లో బిల్లు వేస్తున్నారని.. రూ. 10లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చికిత్సకు తీసుకోవాల్సిన ఫీజులపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 14 రోజుల వైద్యానికి రూ. 4లక్షలే  వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనా చికిత్స కు సాధారణ వార్డు అయితే రోజుకు రూ. 4000 ఆక్సిజన్ వార్డు అయితే రూ. 7500, ఐసీయూ అయితే రూ.తొమ్మిది వేలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పీపీఈ కిట్లు,  మందులకు అదనంగా బిల్లులు వేసుకోవడానికి అనుమతించింది. అయితే ఆస్పత్రులు ఈ ఆదేశాలు పాటించకుండా యథేచ్ఛగా రూ.లక్షలు వసూలు చేశాయి. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలను తమకు అప్పగించాలని ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరింది. అందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. ఆసుపత్రిలో ఇక మిగిలిన పడకలకు కరోనా  ఫీజుగా 14 రోజులకు సాధారణ వార్డు అయితే  రూ.లక్ష, ఆక్సిజన్ వార్డు అయితే రూ.2 లక్షలు,  ఐసీయూ అయితే రూ.3లక్షల నుంచి  రూ. 4లక్షల వరకు వసూలు చేయాలని ఆదేశించింది.

అయితే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కరోనా  చికిత్స అందించలేమని, సగం పడకలను ఇవ్వలేమని  స్పష్టం చేస్తున్నాయి. కరోనాతో వచ్చే వారిలో  కొందరు మధుమేహం, ఆస్తమా, గుండెకు సంబంధించిన వ్యాధులతో వ స్తున్నారని.. అలాంటి వారికి ముందున్న ఆరోగ్య సమస్యలకు చికిత్స చేస్తూనే కరోనా ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని.. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఫీజు వసూలు చేస్తే తాము నష్టపోతామని ఆసుపత్రుల యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి.
Tags:    

Similar News