భారత్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ కూడా 60 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 836 మంది మృతి చెందారని, 57,468 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,06,349 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 57,542కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 23,38,036 మంది కోలుకున్నారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,59,02,137 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. రికవరీ రేటు ఇప్పుడు 75.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 68.2 పర్సెంట్ ఉంది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే... కొత్త కేసుల నమోదులో... ఇండియా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో... అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత ఇండియా నాలుగో దశలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ మళ్లీ మొదటి స్థానానికి చేరింది. ఆ తర్వాత మెక్సికో, బ్రెజిల్, అమెరికా చేరాయి.
ఇక ,తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,842 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1825 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. ఆసుపత్రుల్లో 22,919 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 82,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 761కి చేరింది. జీహెచ్ ఎంసీ పరిధిలో 373 మందికి కొత్తగా కరోనా సోకింది.
ఇక , ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో భారీగా తగ్గింది. 24 గంటల్లో 7895 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన కొన్ని రోజులుగా రోజుకు 10వేల కరోనా కేసులు నమోదుతుండగా, ఇప్పుడు 7895 కేసులు నమోదుకావడం మంచి పరిణామం. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,53,111కి చేరింది. అలాగే, 24 గంటల వ్యవధిలో ఏపీలో 93 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3282కి చేరింది.