కరోనా మహమ్మారి .. దేశంలో ఎక్కువగా విజృంభిస్తుంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇక ఇప్పటివరకు ఇండియా లో 31 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇదే సమయం లో కరోనా గురించి రోజుకొక వార్త వైరల్ అవుతుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సీరం సర్వేచేయగా .. ఆ సర్వే లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైరస్ ప్రభావం పిల్లలు, వృద్దులపై ఎక్కువగా ఉంటుంది అని ఆ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా 5 నుంచి 17 ఏళ్ల లోపు వయసు గల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దీంతో ఆ వయస్సు గల వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అలా కాకపోతే ఈ వయస్సు వారు కరోనా భారిన పడే అవకాశం చాలా ఉంది.
ఢిల్లీ లో సీరం ఆగస్టు ఒకటో తేదీ నుంచి 7వ తేదీ మధ్య రెండోసారి సర్వే చేసింది. ఢిల్లీ జనాభా లో 29.1 శాతం మందిలో సార్స్- కోవ్-2తో పోరాడే ప్రతిరోధకాల అభివృద్ధి జరిగిందని గుర్తించారు. సర్వేలో 15 వేల మంది పాల్గొన గా వారిలో 25 శాతం మంది 18 ఏళ్లలోపు వారు ఉన్నారు. 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారు ఉన్నారు. 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 34.7 శాతం మంది , ఇన్ ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉందని . 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకోవడం కొంచెం ఊరట కలిగిస్తుంది. అలాగే , 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలోని 28.5 శాతం మందిలో వైరస్ తో పోరాడే ప్రతి రోధకాలు అభివృద్ధి చెందాయని సీరం వెల్లడించింది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం 21 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారిలో 61.31 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారని తేలింది. మరోవైపు కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఆక్స్ ఫర్డ్ కోవిషిల్డ్, చైనా, రష్యా.. భారత్‌కు చెందిన మూడు వ్యాక్సిన్ల తయారీ తుది దశలో ఉన్నాయి . వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.