భారత్ ‌లో కరోనా ఉగ్రరూపం ..ఒక్కరోజే 75,760 కరోనా కేసులు !

Update: 2020-08-27 06:00 GMT
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు 60 వేలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులతో పాటు దాదాపుగా  వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఒకేసారి 75,760 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. దీనితో దేశంలో నమోదు అయిన మొత్తం కరోనా పాజిటివ్ కరోనా కేసుల సంఖ్య 33,10,234కి చేరింది. అలాగే గత 24 గంటల్లో మరో 1,023 మంది మరణించారు. దీనితో దేశంలో కరోనా మృతుల సంఖ్య  60,472 కి చేరింది. ఇక తాజాగా 56,013 మంది కోలుకోని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 25,23,771 మంది కోలుకున్నారు.  . ప్రస్తుతం 7,25,991 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాటక, యూపీ, బీహార్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ లో  క కేసులు నఎక్కువ పాజిటివ్  కేసులు మోదవుతున్నాయి. ఇక కరోనా నిర్దారణ పరీక్షల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 9,24,998 శాంపిల్స్‌ను పరీక్షించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల 85 లక్షల 76 వేల 510 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా  రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 2,795 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయని  తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో  8మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483 కి చేరింది. ఆసుపత్రుల్లో 27,600  మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 86,095  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 788కి చేరింది.  

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కొత్త కేసుల సంఖ్య మరోసారి 10 వేలు దాటింది. రాష్ట్రంలో మొత్తం 10,830 తాజా కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మరో  81 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలను కలిపితే, ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి పెరిగింది. 3,541 మంది మృతి చెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 92,208గా ఉండగా 2,86,720 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Tags:    

Similar News