టెస్టు కూడా చేయకుండా కరోనా వార్డుకు దంపతులు.. చివరికి ప్రాణాలు కోల్పోయారు
గుజరాత్ లోని గాంధీ నగర్ లో అనారోగ్యం బారిన పడ్డ దంపతులకు వైద్యులు కనీసం కరోనా టెస్టు చేయకుండానే కోవిడ్ వార్డులో చేర్చి వారి మృతికి కారణమయ్యారు. గాంధీ నగర్ కు చెందిన గణపత్ రావల్ డ్రైవర్. అతడి భార్య తార అంగన్వాడీ కార్యకర్త. వీరికి ఇద్దరు కుమార్తెలు తేజల్, పూనమ్ ఉన్నారు.పూనమ్ కు వివాహం కూడా అయ్యింది. ఆమె తన కొడుకుతో కలసి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. కాగా తారకు గుండెకు సంబంధించి సమస్య ఉండటంతో నాలుగేళ్ళ నుంచి చికిత్స తీసుకొంటోంది.
కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం, ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో ఆమెను కుటుంబీకులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎవరూ చేర్చుకోలేదు. దీంతో గాంధీ నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను జూన్ 15న కోవిడ్ వార్డు లో చేర్చారు. ఆమె ఇంటికి వీడియో కాల్ చేసి ఏడ్చేది. అది చూసి గణపత్ రావత్ లో ఆందోళన పెరిగింది. ఆ తర్వాత వైద్య సిబ్బంది వారింటికి వెళ్లి ఇల్లంతా శానిటైజ్ చేశారు. కాస్త నీరసంగా ఉందని గణపత్ చెప్పడంతో అతడిని కూడా తీసుకెళ్లి కోవిడ్ వార్డులో చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతూ తార జూన్ 21న మరణించగా, 23న గణపత్ మృతి చెందారు. ఈ స్థితిలో తేజల్, పూనమ్ లను బంధువులు, సమాజం అంటరానివారిగా చూసింది. తన తండ్రి ఉంగరం, తల్లి వెండి పట్టీలు సహా బంగారు ఆభరణాలన్నీ ఆస్పత్రి అధికారులు అప్పగించలేదని..అవి తమ చివరి గుర్తులని కలెక్టర్ కు తేజల్ ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సుధా శర్మ మాట్లాడుతూ తేజల్ తల్లిదండ్రులకు ఆస్పత్రిలో మంచి వైద్యం అందించామని, ఆభరణాలు అన్నీ ఇచ్చేశామని..ఇందుకు వారి నుంచి రసీదు కూడా తీసుకున్నామని చెప్పారు.