దేశంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎక్కువ కరోనా కేసులు ఉన్నప్పుడు ఇండియాలో చాలా తక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం ఒక్కరోజే 78,357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 37,69,524కు చేరింది. వీరిలో ఇప్పటికే 29లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వైరస్ కారణంగా కొత్తగా మరో 1,045 మంది ప్రాణాలు విడువగా మొత్తం మరణాల సంఖ్య 66,333కు చేరింది.
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 10,12,367 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్. ఫలితంగా మొత్తం టెస్ట్ల సంఖ్య 4 కోట్ల 43 లక్షలకు చేరింది. కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.98 శాతంగా ఉండగా, డెత్ రేటు 1.76 శాతానికి పడిపోయింది. ఢిల్లీలో కరోనా మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 2.3వేల కేసులొచ్చాయి. జులై నుంచి ఇప్పటివరకూ ఒకే రోజు ఇన్ని ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. ఫలితంగా ఢిల్లీ రికవరీ రేటు 88.5 శాతానికి పడిపోయింది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. వచ్చే వారం రోజుల్లో అత్యధిక కేసుల్లో బ్రెజిల్‌ని వెనక్కి నెట్టి ఇండియా రెండో స్థానానికి వెళ్లేలా ఉంది. అలాగే కొత్త కేసుల నమోదులో ఇండియా 27 రోజులుగా అగ్రస్థానంలో లో కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో బ్రెజిల్, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది.
దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండటమే కాదు, అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదయిన దేశాల కంటే ఐదో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో మరో 320 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాలు 24,903కి చేరాయి. ఏపీలో మరో 10,368 కేసులు బయటడ్డాయి. వరుసగా ఏడో రోజు 10వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏపీలో మొత్తం కేసులు 4,45,139కి చేరుకున్నాయి. మొత్తం 4,503 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో దాదాపు 21.5 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడినట్లు ఓ సర్వే వెల్లడించింది. సెరో సర్వైలెన్స్ స్టడీ ప్రాథమిక విచారణ ద్వారా ఈ విషయం బయటపడింది. దీనికోసం నగరంలోని మొత్తం 15 జోన్లలోని 51 వార్డుల నుంచి 12,405 మంది రక్త నమూనాలను సేకరించారు. వీరిలో 2,673 మంది కరోనా బారిన పడినట్లు తేలింది.