భారత్‌లో కరోనా వైరస్ విలయ తాండవం కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో గత రికార్డ్స్ ను కొల్లగొడుతూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ భారత్ ముందుకుసాగుతుంది. దేశ్యవ్యాప్తంగా 83,883 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ మొదలైన తర్వాత దేశంలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. పాజిటివ్ కేసులు 80వేల మార్క్ దాటడం ఇది మూడోసారి. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడలేదు. మరో 1,043 మంది మరణించారు. నిన్న 68,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. కరోనాను జయించి 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 8,15,538 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 17,433 కేసులు నమోదయ్యాయి. తొలిసారి అక్కడ పాజిటివ్ కేసులు 17వేల మార్క్ దాటాయి. అలాగే, మరో 292 మంది ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్రలో మొత్తం కరోనా మరణాలు 25,195కి చేరాయి.ఇకపోతే శంలోని మొత్తం కరోనా మరణాల్లో 37 శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి తమిళనాడు (7,516), కర్ణాటక (5,950) ఉన్నాయి.
ఇక, తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరోపక్క, రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య లక్ష దాటింది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,817 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,611 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,537 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,00,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 856కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక , ఏపీలో కరోనా వేగంగా పాకిపోతోంది. నిత్యం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. తాజాగా, 60,804 శాంపిల్స్ పరీక్షించగా 10,392 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,199, చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులను గుర్తించారు. అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 397 కేసులు వచ్చాయి.ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 4,125కి పెరిగింది. తాజాగా 8,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కాగా, 3,48,330 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.