భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 83,341 పాజిటివ్ కేసులు, 1,096 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. వీటిలో 8,31,124 యాక్టివ్ కేసులు ఉండగా.. 30,37,152 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 68,472 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 66,659 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 77.09 శాతం ఉండగా, మరణాల రేట్ 1.75 శాతం, యాక్టివ్ కేసులు 21.16 శాతంగా ఉంది.
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. ప్రతీ రోజూ 5 వేలు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 8,43,844 మందికి కరోనా సోకగా.. 25,195 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4,65,730 కేసులు నమోదవగా.. 4,200 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి. ఇక, 24 గంటల్లో 11,69,765 కోవిడ్-19 పరీక్షలు జరగగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,66,79,145 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రపంచంలోనే కరోనాతో తీవ్రమైన ప్రభావితమైన దేశాల్లో ఒకటి బ్రెజిల్. అక్కడ ఇప్పటివరకు 4,046,150 పాజిటివ్ కేసులు నమోదు మన దేశంలో ఇప్పటివరకు 3,936,747 కరోనా కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే అతి కొద్దిరోజుల్లోనే సెకండ్ ప్లేస్ లోకి వెళ్లే అవకాశం ఉంది.