భారత్ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 73,272 కేసులు !

Update: 2020-10-10 07:30 GMT
భారత్ ‌లో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో 73,272 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,79,424 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 926 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,07,416 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 59,88,823 మంది కోలుకున్నారు. 8,83,185 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా , దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,57,98,698 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,64,018 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.        

రాష్ట్రాల వారీగా చూస్తే... మహారాష్ట్రలో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. అక్కడ కొత్త కేసుల్లో జోరు 4,491 తగ్గి... మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,947కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక 118870, ఆంధ్రప్రదేశ్ 47665, తమిళనాడు 44197, ఉత్తరప్రదేశ్ 41287, అసోం 29710 బెంగాల్ 29296 ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని 24 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి.  

ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య కేసుల తేడా... 9 లక్షలే ఉంది. రోజువారీ కొత్త కేసులలో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతుంటే... అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. రోజువారీ మరణాల్లో భారత్ మొదటిస్థానంలో ఉండగా... అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, మెక్సికో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Tags:    

Similar News