మ‌హ‌మ్మారి మ‌ళ్లీ రావ‌ట్లేదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

Update: 2020-10-12 07:45 GMT
ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ షురూ అయ్యింది. మొన్న‌టి వ‌ర‌కు  దేశంలో భారీగా కేసులు న‌మోదు అవుతున్న స్థానే.. ఇప్పుడుకాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. దేశంలోని ఐదారు రాష్ట్రాలు త‌ప్పించి.. మిగిలిన రాష్ట్రాల్లో క‌రోనా తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉంద‌ని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా విడుద‌ల చేసే గ‌ణాంకాలు కూడా ఇదే విష‌యాన్నివెల్ల‌డిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారి సెకండ్ వెర్ష‌న్ స్టార్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. చాలామందిలో రీ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. క‌రోనా బారిన ప‌డి.. కోలుకున్న వారు తాము మ‌రోసారి దాని బారిన ప‌డిన‌ట్లుగా ఆందోళ‌న చెందుతున్నారు. అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేద‌ని కేంద్ర‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు. కోవిడ్ బాధితుల‌కు మ‌రోసారి ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు.

నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెత‌ను ఈ ఇష్యూలో చూస్తే.. స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌ట‌మే ఈ భావ‌న‌కు కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. క‌రోనా బారిన ప‌డి కోలుకున్న‌వారి శ‌రీరంలో స‌ద‌రు వైర‌స్ డెడ్ సెల్స్  ఉంటాయ‌ని.. ఈ కార‌ణంగా ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లో వైర‌స్ ఉన్న‌ట్లుగా చెబుతుంద‌న్నారు. అందుకే.. వైద్యుల స‌ల‌హాతోనే ప‌రీక్ష చేయించుకోవాల‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హ‌మ్మారిని గుర్తించేందుకు స్వ‌దేశీ టెక్నాల‌జీతో త‌యారు చేసిన ఫెలూదా ప‌రీక్షను కొద్ది వారాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా క‌రోనా సోకిన వారికి మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంద‌న‌టంలో ఎలాంటి నిజం లేద‌ని తేల్చారు. మ‌రి.. ఇప్ప‌టికైనా ఇలాంటి అనుమానాలు ఉంటే.. గుండెల్లోని భారాన్ని కింద‌కు దించేసిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News