భారత్ లో తగ్గిన కరోనా కేసులు..మరణాలు!

Update: 2020-10-13 06:32 GMT
చలికాలం సమీపిస్తుండడంతో దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడం ఊరటనిస్తోంది. నిన్నటి వరకు భారత్ లో భారీగా నమోదవుతూ వస్తున్న కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం.. భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55342 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో మొత్తం కేసు సంఖ్య 71,75,881కి చేరింది. ఇందులో 62,27,296 మంది ఇప్పటికీ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,38,729 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

రోజువారీ రికవరీ కేసులు భారీ సంఖ్యలో ఉండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతోంది. అదే విధంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 706 మంది మరణించారు. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,09,856కి చేరింది. నిన్న ఒక్కరోజే ఇండియాలో 71760 మంది ఉండడం విశేషం.

ఇక  తెలంగాణలోనూ కేసుల తీవ్రత స్టడీగా కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,708 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,14,792 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,233గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది.

ఇక ఇప్పటి వరకు 1,89,351 మంది కోలుకోగా ప్రస్తుతం 24,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో రికవరీ రేటు 86.8 శాతం ఉండగా తెలంగానలో 88.15 శాతంగా ఉంది. ఇక నిన్న 46,835 పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 36,24,096 పరీక్షలు చేశారు.

ఏపీలో గత 24 గంటల్లో 3224 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా భారీగా ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7.58 లక్షలకు చేరుకోనున్నాయి. గత 24 గంటల్లో 32మంది మరణించారు.
Tags:    

Similar News