ఇండియా లో కరోనా జోరు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకి లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా .. ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 55,722 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,50,273కి చేరింది. అలాగే నిన్న కొత్తగా 579 మంది మాత్రమే చనిపోయారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ మరణాలు నమోదవ్వడం ఇదే తొలిసారి. మొత్తం మరణాల సంఖ్య 1,14,610కి చేరింది. మరణాల రేటు మాత్రం రోజూలాగే 1.5 శాతమే ఉంది.
ఇక , దేశం లో గత 24 గంటల్లో 66,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ లు ఎక్కువ గా నమోదయ్యాయి. ఇది చాలా విషయం. ఇండియా లో రికవరీ రేటు మరింత పెరిగి... 88.3 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,72,055గా ఉన్నాయి. నిన్న దేశం లో 8,59,786 టెస్టులు చేశారు. దీనితో దేశంలో ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 9కోట్ల 59లక్షల 786కి చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. భారత్, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజు వారీ కొత్త కేసుల్లో ఇండియా తర్వాత అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, ఇటలీ, బ్రెజిల్ తర్వాతి పొజిషన్ల లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్ లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్, ఇటలీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి
ఇక , తెలంగాణ లో కూడా కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,275 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,896 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,00,68 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 21,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో26,027 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ ల సంఖ్య 38,56,530 కు చేరింది.
ఇక , ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఏపీ లో 3986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రం లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 783132కి చేరింది. ఇక 24 గంటల వ్యవధిలో 23మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6429కి పెరిగింది. ఏపీలో 24 గంటల వ్యవధిలో 74,945 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటి వరకు ఏపీలో 70,66,203 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. 24 గంటల్లో ఏపీలో 4591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 740229 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 36474 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.