భారత్ మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. నిన్న 50 వేల కంటే తక్కువగా నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య , నేడు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ వివరాల ప్రకారం దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 50 వేలు దాటింది. ఇండియాలో నిన్న కొత్తగా 54044 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.9 శాతంగా ఉంది. నెల కిందట ఇది 8 నుంచి 10 శాతం దాకా ఉండేది. మొత్తం ఇప్పటివరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76,51,107కి చేరింది. అలాగే నిన్న కరోనాతో 717 మంది చనిపోవడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 115,914కి చేరింది. అదే సమయంలో 61,775 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67,95,103 మంది కోలుకున్నారు. 7,40,090 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.7 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. ఇండియాలో నిన్న 10,83,608 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 9కోట్ల 72లక్షల 379కి చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. భారత్, బ్రెజిల్, రష్యా, స్పెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానానికి రాగా... ఆ తర్వాత ఇండియా, బ్రెజిల్, బ్రిటన్ , ఫ్రాన్స్ ఉన్నాయి. ప్రధాని మోదీ నిన్న చెప్పినట్లుగా యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ ఇండియా లో కరోనా పెరిగే అవకాశం ఉంది.