భారత్ లో తగ్గుతున్న కరోనా మరణాలు .. రికవరీ రేటు , మరణాల శాతం ఎంతంటే ?
దేశంలో కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నా భారత్ లో దాని తీవ్రత లేదని , దేశంలో కోటి పాజిటివ్ కేసులు దాటిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా కొన్ని గణాంకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రికవరీ రేటు, తక్కువ మరణాల రేటు కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 14 -20 మధ్య రోజుల్లో సగటున కేవలం 351 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యతో పోలిస్తే భారత్ లో కనిష్ట మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, నిబంధనల కారణంగా గత నెల రోజుల్లో సగటున రోజుకు 400 లోపు మరణాలు మాత్రమే సంభవించాయని , నిన్న కొత్తగా 24,337 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,00,55,560కి చేరింది. అలాగే... నిన్న కరోనాతో 333 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,45,810కి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, దేశంలో రికవరీ రేటు 95.51 శాతంగా ఉందని, మరణాల సంఖ్య కేవలం 3 శాతమేనని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల తో పోలిస్తే భారత్‌లో కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో నిన్న 9,00,134 టెస్టులు జరిగాయి. మొన్నటి కంటే అవి 2,07,547 తక్కువ జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 16,20,98,329కి చేరింది.