దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన నిబంధనలను కేంద్రం మరోసారి పొడిగించింది. మార్గదర్శకాలను జనవరి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31 వరకు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం నిబంధనలు పొడిగించింది.
బ్రిటన్ లో కలకలం సృష్టించిన కరోనా కొత్త వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం నిఘా, వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది.
ఇక ఆయా జోన్ల గుర్తింపు.. కంటోన్మెంట్లు విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిర్ధేశించిన నియంత్రణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని తెలిపింది.
నవంబర్ 25న కేంద్ర హోంశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.