భారత్ లో కొత్త‌గా 11,713 మందికి కరోనా..24 గంటల్లో ఎంతమంది మరణించారంటే?

Update: 2021-02-06 05:45 GMT
దేశంలో క‌రోనా వైర‌స్ మహమ్మారి విజృంభ‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నా కూడా మరోవైపు కరోనా మహమ్మారి కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే ..  గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,713 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇక ఈ వైర‌స్ నుంచి 14,488 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 95 మంది మ‌ర‌ణించిన‌ట్లు పేర్కొంది.

దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,14,304కు చేరుకోగా, మ‌ర‌ణాల సంఖ్య 1,54,918కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 1,05,10,796 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,590.  దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 97.19 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. భారత్‌ లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 54,16,849 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇకపోతే, ఫార్మా మేజర్ ఫైజర్ సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్  దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 3న  జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది. భారత్‌లో అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెగ్యులేటరీ ఆమోద దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఫైజర్ నిర్ణయించినట్లు అమెరికన్ డ్రగ్ దిగ్గజం శుక్రవారం తెలిపింది
Tags:    

Similar News