దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు .. ఒక్కరోజులో ఎన్నంటే ?

Update: 2021-06-08 05:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి జోరు దేశంలో కొనసాగుతుంది. ప్రతి నిత్యం కూడా కరోనా వైరస్ కేసులు భారీగానే నమోదు అవుతూనే ఉన్నాయి. అలాగే , కరోనా జోరుకి మరణాలు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. సెకండ్ వేవ్ లో గత కొన్ని రోజుల పాటుగా దేశం మొత్తం అల్లాడిపోతోంది. అయితే , ఈ మధ్య గత పది రోజుల నుండి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఇదిలా ఉంటే .. కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం ప్రజలకు ఊరటను ఇస్తోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 87,632 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 63 రోజుల్లో ఇంత తక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత నెల ఇదే రోజున దేశవ్యాప్తంగా 4,14,188 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  అలాగే 2032 మంది కరోనా మహమ్మారి బాధితులు మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని కొత్తగా 1,85,722 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు13,03,702 కాగా, ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,73,41,462కి చేరింది. అటు ఇప్పటివరకు దేశంలో 23,61,98,726 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు దశల వారీగా అన్‌ లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి.

ఇదిలా ఉంటే , కరోనా వ్యాక్సిన్ల పై రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేంద్రమే కంపెనీల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందజేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై కేంద్రమే పూర్తిగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. 75 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రమే రాష్ట్రాలకు అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. 25 వ్యాక్సిన్ డోసులు ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. ఇకపై రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
Tags:    

Similar News