ఇటలీలో ఎందుకన్ని మరణాలు.. అసలు కారణం ఇదేనట

Update: 2020-12-22 06:00 GMT
కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావటమే కాదు.. కొన్ని దేశాల్నిఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ జాబితాలోకి వస్తుంది ఇటలీ. ఓపక్క బ్రిటన్ స్ట్రెయిన్.. మరోవైపు సెకండ్ వేవ్. దీంతో పలుదేశాలు కరోనా భయంతో వణుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో మరే దేశంలో లేని రీతిలో ఇటలీలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వస్తున్న అంచనాల ప్రకారం రోజు గడిస్తే చాలు ఇటలీలో 600లకు పైగా మరణాలుచోటు చేసుకుంటున్నాయి. ఈ మరణాలన్ని కరోనా కారణంగానే కావటం గమనార్హం.

మరే దేశంలో లోని రీతిలో ఇటలీలోనే ఎక్కుగా మరణాలు చోటు చేసుకోవటానికి కారణం ఏమిటి? అన్న విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 68,800 మంది మరణించారు. అధిక మరణాలు చోటు చేసుకుంటున్న దేశాల్లో ఇటలీ ఐదో స్థానంలో ఉంది. ఇటలీలో తక్కువ జనాభా ఉన్నప్పటికి.. ఇంత భారీగా మరణాలు చోటు చేసుకోవటానికి కారణం ఏమిటి? అన్న అంశంపై అధ్యయనం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన షాకింగ్ నిజాలు తాజాగా బయటకు వచ్చాయి. అధిక దేశాలున్న దేశాలతో పోలిస్తే.. తక్కువ జనాభా ఉన్న ఇటలీలో కరోనా మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఆ దేశంలోని ప్రజల వయసేనని చెబుతున్నారు. ప్రపంచంలో పెద్దవయస్కుల జనాభా ఇటలీలో ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. జపాన్ తర్వాత ఎక్కువగా ఉండే దేశం ఇటలీగా తేల్చారు. ఒక లెక్క ప్రకారం ప్రతి నలుగురు ఇటాలియన్లలో ఒకరు 65ఏళ్లకుపైబడిన వారే కావటం గమనార్హం. ఈ కారణంగానే కోవిడ్ మరణాల్లో ఇటలీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇటలీలో దాదాపు 22.8 శాతం ప్రజలు 65 ఏళ్లకు పైబడిన వారే. ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో ఇటలీనే ముందుంది. ఆ దేశంలో ప్రజల సగటు ఆయుష్షు.. 83 ఏళ్లు.  అయితే.. జీవన కాలం ఎక్కువగా ఉన్నప్పటికీ దేశ జనాభాలోని పెద్ద వయస్కుల్లో దాదాపు 70 శాతం మందికి కనీసం రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే కరోనా బారిన పడినోళ్ల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఇదే.. ఆ దేశంలో ఎక్కువ మరణాలకు కారణమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News